పెండింగ్ డీ ఏ లు వెంటనే విడుదల చేయాలి- డిటిఎఫ్ జిల్లా నాయకుడు ఎస్. సంపత్
ప్రభుత్వ ఉద్యోగులందరికి పెండింగ్ లో ఉన్న మూడు డీ ఏ లను తక్షణం విడుదల చేయాలని డిటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు సార్ల సంపత్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డి ఏ లను చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో దీపావళి కానుకగా మూడు డీ ఏ లను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్ సీ నివేదికను తెప్పిoచుకొని అమలుకు చర్యలు వేగవంతం చేయాలని పెండింగులో ఉన్న మెడికల్, సరెండర్, జీ పీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులను వెంటనే చెల్లించాలి.ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీ పీ ఎస్ ను రద్దు చేసి ఓ పీ ఎస్ ను అమలు చేయాలని 317 జీ ఓ బాధితుల సమస్యను పరిష్కరించాలని ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో పటిష్ఠంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు