*శ్రీఅయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం మాలాధారణ…*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప నగర్ లో అపర శబరిమలగా పేరుగాంచిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం మాలాధారణ శబరిమలకు వెళ్లే స్వాములు గురు స్వాములు శుక్రవారం దాదాపుగా 70 మంది స్వాములకు మాలాధారణ చేశారు. స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణు ఘోషతో అయ్యప్ప దేవాలయం మార్మోగిoది. ఓనం మాలాధారణకు జమ్మికుంట నుండి స్వాములు భక్తులు అధిక సంఖ్యలో శబరిమలకు ప్రతి సంవత్సరం వెళుతుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో స్వాములు మాల వేసుకున్నారు మాల వేసుకున్న స్వాములే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో శబరిమలకు వెళ్లడం స్వాములకు భక్తులకు ఆనవాయితీగా మారింది అలాగే మాలాధారణ కార్యక్రమంలో స్వాములు గురు స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు ప్రధాన హారతి ఉంటుందని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ తెలియజేశారు అలాగే శుక్రవారం నుండి అనగా 2-8-2024 నుండి 13-9-2024 వరకు స్వాములకు ప్రతిరోజు 12:30 గంటలకు బిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ బిక్ష దాతలుగా ఉండే వారు అయ్యప్ప స్వామి దేవాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ సిరిమల్ల జయేందర్ గురుస్వామి మామిడాల మనోహర్ గురుస్వామి ఓల్లాల జగదీశ్వర్ గురు స్వామి వెంకట్ రెడ్డి గురుస్వామి ప్రతాప్ రెడ్డి గురుస్వామి బోనగిరి రాజేందర్ గురుస్వామి అశోక్ గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.