Headlines:
-
“సామాజిక సేవకుల కృషిని గౌరవించిన రత్న జాతీయ అవార్డు”
-
“సినీ గేయ రచయిత చేతుల మీదుగా సింగరేణి కార్మికుడికి సేవా రత్న పురస్కారం”
-
“బహుజన సాహిత్య అకాడమీ నుండి ఎస్ డి నాసర్ పాషాకు సేవా రత్న అవార్డు”
సింగరేణి సేవా సభ్యులు,సింగరేణి కార్మిక నాయకులు ఎస్ డి నా సర్ పాషా సింగరేణి కార్మికులకు ఈ అవార్డు అంకితం
అవార్డు గ్రహీత నా సర్ పాషా వెల్లడించారు.బహుజన సాహిత్యం అకాడమీ (బి.ఎస్.ఏ) వారు 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన ఉత్తమ సామాజిక సేవకులకు గానూ అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ సేవా రత్న అవార్డును ఆదివారం నాడు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ చేతుల మీదుగా మణుగూరు ఏరియా సింగరేణి సేవా సమితి సభ్యులు సింగరేణి కార్మిక నాయకులు ఎస్ డి నా సర్ పాషా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ గేయ రచయిత మౌనాశ్రీ మల్లిక్ మాట్లాడుతూ అవార్డు బాధ్యతను మరింత పెంతుందని అందుకు తన సాహిత్య జీవితమే ఉదాహరణ అన్నారు.సంస్కార వంతమైన జీవితం ఎన్నో కీర్తి శిఖ రాలను అదిరోహించ వచ్చని తెలిపారు.భూమిలో విత్తనములా అవకాశాలను అందించుకుని మొలకెత్తాలని పైకి ఎదగాలని అన్నారు. తను రచించిన తిరిగి చూడు తిరిగి చూడు మరియు కాపాడరా కల్ప వల్లిని పూజించారా పుడమి తల్లిని పాటలను పాడి సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అవార్డు స్ఫూర్తి తో పాషా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, కవులకు రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సుమారుగా మూడు వందల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు.సామాజిక సేవలో ఎంతగానో కలలని ప్రోత్సహిస్తున్న సింగరేణి ఉద్యోగులకు సంస్థకు అవార్డును అంకిత మిస్తున్నాట్లు తెలిపారు. అవార్డు అందజేసిన వారిలో బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎం గౌతమ్ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్, గౌడ్ బాదే వెంకటేశం, ఫణి కుమార్,ప్రముఖ కన్నడ అనువాద రచయిత్రి వెంకమ్మ,నల్లా జ్యోతి,కోయిల, నాసర్ పాషా కుటుంబ సభ్యులు జమీలా బేగం,హుమాయూన్ తది తరులు పాల్గొన్నారు.