Headlines:
-
అనీమియా బాధితురాలికి సకాలంలో రక్తం అందించిన మానవతావాది
-
రెడ్ క్రాస్ సహకారంతో అనీమియా బాధితురాలికి రక్తదానం
-
కమారెడ్డిలో అనీమియా బాధితురాలికి ఓ పాజిటివ్ రక్తం అందించిన రక్తదాత
-ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 28:
కామారెడ్డి జిల్లా కుప్రియాల్ గ్రామానికి చెందిన పోచవ్వ (70) వృద్ధురాలు అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారి కుటుంబ సభ్యులు ఓ పాజిటివ్ రక్తం కావాలని సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త రాకేష్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని కేబీసీ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు జీవన్ వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.