పన్నుల పేరిట నడ్డివిరిచి, రాజకీయ లబ్ది పొందేందుకే సుడా పరిధి పెంపు

గ్రామీణ ప్రాంత ప్రజలను పన్నుల పేరిట నడ్డివిరిచి, రాజకీయ లబ్ది పొందేందుకే సుడా పరిధి పెంపు

బిజెపి సిద్దిపేట జిల్లా మాజీ ఉపాధ్యక్షులు తోడుపునూరి వెంకటేశం

తమ రాజకీయ స్వార్థం కోసమే సిద్దిపేట అర్బన్ డెవలపమెంట్ అధారిటీ (సుడా)లో మూడు మండలాలు తప్ప జిల్లా మొత్తం 286 గ్రామాలను విలీనం చేశారని బీజేపీ సిద్దిపేట జిల్లా నేత తొడుపునూరి వెంకటేశం మండి పడ్డారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో 2017 లో 26 గ్రామాలతో సుడా ఏర్పాటు అయిందన్నారు. అప్పుడే చాలా గ్రామాలు వ్యతిరేకించాయన్నారు. అప్పుడు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ స్వార్థం కోసమే ప్రజలను ఇబ్బందులను పెడుతున్నారన్నారు. జిల్లా మొత్తాన్ని సిద్దిపేట సుడాలో విలీనం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలు తప్ప మొత్తం సుడ పరిధిలోకి తేవడం పదవులు, రాజకీయాలు, డబ్బు, హోదా వీటిపైనే దృష్టి తప్ప ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే సోయి లేదన్నారు. రాబడి పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని సాకు తో విలీన డ్రామాలు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. తమ రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

జిల్లాలోని గ్రామాలను సుడా కల్పడం అంటే గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను అనేక వాటిపై పన్నులు రూపంలోనో ప్రజలపై భారం పడుతుందన్నారు. ప్రజలు ఇబ్బందులను మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా సిద్దిపేట జిల్లాను సుడా పరిధిలోకి తేవడం శోచనీయమన్నారు. జిల్లాను సుడా లోకి తెచ్చిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now