పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకూనురుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టుయిన వారికి బీజేపీ ఎంపీ ఆర్ రఘునందన్‌రావు మద్దతుగా నిలిచారు.

తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ఊరుకునేది లేదని పోలీసులకు ఆయన సూచించారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని పోలీసులకు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమ పార్టీ కార్యకర్తలు చేశారన్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్టానుసారం అరెస్ట్ చేస్తే సహించేది లేదని పోలీసులకు ఈ సందర్బంగా ఆర్ రఘునందన్ రావు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now