Headlines in Telugu:
-
పర్యావరణ పరిరక్షణ కోసం అక్రమ కలప దందా అరికట్టాలి: తంబల్ల రవి
-
ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కలపను నిలిపివేయాలనీ ఆదివాసి నాయకుల విజ్ఞప్తి
-
కలప దందా ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ రేంజర్ కి వినతి
-
గిరిజనులకు భవిష్యత్తులో ప్రమాదం కలగకుండా పర్యావరణాన్ని కాపాడాలి
అక్రమ కలప దందా ముఠాల పై చర్యలు తీసుకోవాలనీ దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ కి వినతి పత్రం
అర-కోరా అనుమతులుతో పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్న కలపను అరికట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా మారు మూల గ్రామాల నుంచి కొన్ని వందల టన్నుల కలప ట్రాక్టర్,లారీలలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి కలప దందా ముఠాలను అరికట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి,ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు తులమో, పలమో ఆశ చూపి అర కొర అనుమతులతో జీడి కలపతో పాటు ఇతర కలపను కూడా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు, భవిష్యత్తులో వృక్షాలు అంతరించి పోయే అవకాశం ఉన్నది కావున పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఈ కలప దందా ముఠాలను అరికట్టాలని,ఎవరైతే కలప తరలింపు చర్యలకు పాల్పడుతున్నారో వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయుకులు తంబళ్ల రవి,కారం నాగేంద్ర బాబు పాల్గొన్నారు.