నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన – అర్బన్ ఎమ్మెల్యే

అభివృద్ధి
Headlines in Telugu:
  • నిజామాబాద్ నగరాభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే
  • సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన: ఎమ్మెల్యే ధన్ పాల్ ఆదేశాలు
  • నగర అభివృద్ధి కోసం 100 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్
  • అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టర్లకు సూచనలు

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ అక్టోబర్ 30:

సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో, త్వరగ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించిన -ఎమ్మెల్యే ధన్ పాల్.

ఇందూర్ నగరం : 27వ డివిజన్ ఆనంద్ నగర్, 9వ డివిజన్ ఓల్డ్ నాగారం, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది…

 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జనరల్ ఫండ్ ధ్వరా ప్రతి డివిజన్ కు పదిలక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించడం జరిగింది.

నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగిన నిధులు మంజూరు చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లి, ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు.. నగర అభివృద్ధికి 100 కోట్లు ప్రతేక నిధులు విడుదల చేయాలనీ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, గెలిచి పదినెలలు గడుస్తున్న ఎమ్మెల్యేగా తనకు రావలిసిన సొంత నిధులు కూడా రాలేదని అన్నారు వెంటనే వాటిని కూడా విడుదల చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెల్డింగ్ నారాయణ, సాయి వర్ధన్, బుర్గుల ఇందిర &వినోద్ బిజెపి నాయకులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ,మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now