గొడప్రతుల ఆవిష్కరణ

ఆవిష్కరణ
Headlines in Telugu:
  • కామ్రేడ్ దుర్గంపూడి వెంకట కృష్ణ విగ్రహావిష్కరణ నవంబర్ 9న ఆర్మూర్ లో
  • సిపిఐ (ఎం-ఎల్) పిలుపు: విప్లవ యోధుడి స్మారక సభకు మద్దతు
  • నక్సల్ ఉద్యమంలో కామ్రేడ్ డివికే పాత్రపై స్మారక సభ
  • సిపిఐ (ఎం-ఎల్) నాయకత్వం లో కామ్రేడ్ డివికే స్మారక విగ్రహావిష్కరణ

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి అక్టోబర్ 30:

భారత విప్లవోద్యమ కమ్యూనిస్టు యోధుడు, ప్రజాపంథా మార్గదర్శకుడు అమరుడు కామ్రేడ్ దుర్గంపూడి వెంకట కృష్ స్మారక విగ్రహావిష్కరణ నవంబర్ 9న ఆర్మూర్ లో జరిగే సభను జయప్రదం చేయాలని సి.పి.ఐ(ఎం-ఎల్ ) నాయకులు గుమ్ముల గంగాధర్ పిలుపునిచ్చారు బుధవారం ఎడపల్లి మండలం జమ్లం గ్రామం లో నిర్వహించిన కార్యక్రమం లో నవంబర్ 9న ఆర్మూర్ పట్టణంలో కామ్రేడ్ కుమార్ నారాయణ భవన్ వద్ద జరిగే కామ్రేడ్ డివికె స్మారక విగ్రహావిష్కరణ, సభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ… కామ్రేడ్ డివికే అన్న నక్సల్ బరి మొదటి తరానికి చెందిన భారత విప్లవోద్యమం సృష్టించుకున్న అరుదైన కమ్యూనిస్టు విప్లవ కారుడని, విప్లవ కమ్యూనిస్టు ఆశయాల కోసం చివరి శ్వాస దాకా అవిశ్రాంతంగా పనిచేసిన విప్లవ యోధుడని, అన్నారు. కార్యక్రమం లో ఎడపల్లి మండల నాయకులు .శ్రీపతి మల్లేష్. కాశ .రవి, వైద్యనాథ్. పెద్ద సాయిలు .అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now