Headlines :
-
మహారాష్ట్రలో సిపిఎం నామినేషన్లకు భారీ ర్యాలీలతో ప్రజా మద్దతు
-
దహను, కల్వాన్, షోలాపూర్ నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థుల నామినేషన్ వేడుకలు
-
మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు సిపిఎం ప్రచారం – వేలాది మంది ప్రజల ర్యాలీలు
వేలాది మందితో ప్రజా ర్యాలీ
మహారాష్ట్రలో మూడు స్థానాలకు సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో దహను, కల్వాన్, షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గాల్లో సిపిఎం పోటీ చేసింది. ఇందులో ఇండియా బ్లాక్ (ఎంవిఎ) భాగంగా పోటీ చేస్తున్న ఈ మూడు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. దహను (ఎస్‌టి) నియోజకవర్గంలో ఇండియా బ్లాక్ పార్టీల నేతృత్వంలో 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం సిట్టింగ్ ఎమ్మెల్యే వినోద్ నికోల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, సిపిఎం నేతలు కిసాన్ గుజార్, మరియం ధావలే, కిరణ్ గహలా, రడ్కా కలంగ్డా, లక్ష్మణ్ డోంబ్రే, లహానీ దౌదా, సునీతా షింగ్డా, ఎన్‌సిపి నేతలు మిహిర్ షా, వరుణ్ పరేఖ్, తన్మరు బారి, కాశీనాథ్ చౌదరి, కాంగ్రెస్ నేతలు సంతోష్ మోరే, హఫీజు ఖాన్, సుధాకర్ రౌత్, శివసేన నేతలు అజరు ఠాకూర్, సంజరు కాంబ్లే, సంజరు పాటిల్, ఉజ్వల దామ్షే, కష్టకారి సంఘటన నేతలు బ్రియాన్ లోబో, మధు ధోడి, భారత్ జోడో అభియాన్ నాయకులు రాజు భిసే, రమాకాంత్ పాటిల్ పాల్గొన్నారు.
కల్వాన్ (ఎస్‌టి)లో సిపిఎం మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు జెపి గవిట్ నామినేషన్ దాఖలు చేశారు. నాసిక్ జిల్లాలోని కల్వాన్‌లో సుర్గానా తహసీల్‌ల నుండి వేలాది మంది ప్రజలు, గిరిజన, గిరిజనేతర రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, ఎన్‌సిపి లోక్‌సభ ఎంపి భాస్కర్ భాగారే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శిరీష్ కొత్వాల్, శివసేన రూరల్ జిల్లా అధ్యక్షులు జయంత్ దిండే, ఎన్‌సిపి నేత రవీంద్ర దేవ్రే, కాంగ్రెస్ నేత శైలేష్ పవార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సునీల్ మలుసరే, రాష్ట్ర కమిటీ సభ్యులు సుభాష్ చౌదరి, భికా రాథోడ్, ఇర్ఫాన్ షేక్, ఇంద్రజిత్ గావిత్, ఇంకా సావ్లిరామ్ పవార్, నీలేష్ షిండే పాల్గొన్నారు.
షోలాపూర్ కలెక్టరేట్‌కు 12 వేల మందికి పైగా కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సిపిఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నరసయ్య ఆదాం నామినేషన్ దాఖలు చేశారు. బీడీ, పవర్‌లూమ్, నిర్మాణ, రవాణా, అంగన్‌వాడీ, ఆశా తదితర రంగాల్లోని కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఉదరు నార్కర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంహెచ్ షేక్, రాష్ట్ర కమిటీ సభ్యులు నసీమా షేక్, నళిని కల్‌బుర్గి, యూసుఫ్ మేజర్, మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు కామిని ఆడమ్, వ్యాంకటేష్ కొంగరి, అడ్వకేట్ అనిల్ వాసం తదితరులు పాల్గొన్నారు.