*మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు*
*ఇల్లందకుంట అక్టోబర్ 31 ప్రశ్న ఆయుధం::-*
గురువారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలోనీ సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు వంగ రామకృష్ణ ఆద్వర్యంలో భారతరత్న స్వర్గీయ మాజీ తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీ 40 వ వర్ధంతి వేడుకలను అలాగే భారతదేశ తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుకలను పురస్కరించుకొని వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగ రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పరిపాలనే నిదర్శనమని దేశ వ్యాప్తంగా ఘరిబి హటావో నినాదం తో 40 రోజులు పర్యటన చేసి 300 ల సభలు నిర్వహించి ప్రజలలో చైతన్యం కలిగించి 20 సూత్రాల పథకం,హరిత విప్లవం ,భూ పంపిణీ మొదలగు సంక్షేమ కార్యక్రమాలు అందించారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి మహిళలకు రానున్న రోజులలో ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 పించన్ ఇందిరమ్మ ఇళ్లు త్వరలో ఇవ్వన్నారని అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారానే రజాకార్ల దౌర్జన్యాల నుండి హైదరాబాద్ రాష్ట్రం కు స్వాతంత్రం లభించి భారతదేశంలో విలీనం చేసిన ఘనత వారికే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి రఫీ బుర్ర రమేష్ రెడ్డి సారంగం సారయ్య పరకాల విజయ్,మురహరి రాజు, బొమ్మేడి సతీష్ ,భోగం చిరంజీవి, పద్మయ్య, మొటపోతుల భూమయ్య,కొండ వెంకన్న,భోగం రాజీరు యూత్ కాంగ్రెస్ నాయకులు భోగం శ్యామ్,భోగం రాజు తదితరులు పాల్గొన్నారు