అకాల వర్షానికి తడిసిపోయిన మక్కలని ప్రభుత్వం మద్దత్తు ధర తో కొనుగోలు చేయాలి

కొనుగోలు
Headlines :
  • ఆకాల వర్షానికి తడిసిపోయిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలి
  • సిపిఐ ఎంఎల్ నాయకుల డిమాండ్
  • కొమరారం లో గోడౌన్ నిర్మాణం అవసరం

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

కొమరారం లో రైతుల కోసం ఒక గోడౌన్ ని నిర్మించాలని కోరారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి
గత రెండు రోజులు గా కురుస్తున్న ఆకాల వర్షానికి మక్కాజొన్న రైతుల చాలా తీవ్రoగా నష్టపోయినరాని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు మండల నాయకులు సంతు, మాలు,మోతిలాల్, భద్రయ్య అన్నారు.న్యూడెమోక్రసీ ప్రతినిధి బృందం రైతుల తడిసిన మక్కలని కల్లం వద్ద పరిశీలించారు.గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి కొమరారం, పొలారం, పోచారం, మాణిక్యారం లో మక్కాజొన్నలు మొత్తం తడిసిపోయింది అని, ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిపోయిన ధాన్యo ను మద్దత్తు ధరరూ,,3000 రూపాయలతో కొనుగోలు చేయాలనీ, దళరులు ధాన్యం తడిసిoదనే పేరుతో అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదని చేసినారు.వెంటనే కొమరారం లో కొనుగోలు కేంద్రం ని ఏర్పాటు చేయాలనీ, గోడౌన్ ని ఏర్పాటు చేయాలి అని లేకుంటే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక చేసినారు. ఈ కార్యక్రమం లో రైతులు భద్రయ్య నాగేష్, లక్ష్మన్, బొడ్య తదితరులు పాల్గొన్నరు.

Join WhatsApp

Join Now