ఈనెల 8 న పినపాక తహసిల్దార్ కు ఎస్సీ కులాల సమస్యలపై వినతి పత్రం

తహసిల్దార్
Headlines :
  • ఈనెల 8 న పినపాక తహసిల్దార్ కు ఎస్సీ కులాల సమస్యలపై వినతి పత్రం
  • రిజర్వేషన్ పెంచడానికి, అంబేద్కర్ పథకం అమలుకు డిమాండ్
  • ఎస్సీ కులాల ప్రజలందరినీ ఆదరించాలని పిలుపు

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ఈనెల 8 న పినపాక తహసిల్దార్ కు ఎస్సీ కులాల సమస్యలపై వినతి పత్రం

పినపాక మండల తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేసే కార్యక్రమం విజయవంతం చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్ గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించారు.ఈనెల 8 న పినపాక మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందజేయడానికి ఎస్సీ కులాల ప్రజలంతా అధిక సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల తొలగించిన స్థానిక రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని, రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున రిజర్వేషన్ 20% పెంచాలని డిమాండ్ చేశారు.ఎస్సీ కులాలు ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు, ఇంటి స్థలం లేని పేదలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు, సాగు భూమి, పోడుభూమి ఉండి అక్కుపత్రం లేని ఎస్సీ రైతులు హక్కు పత్రం కోసం దరఖాస్తులు వ్రాసుకొని తాసిల్దార్ కు అందజేయడానికి అధిక సంఖ్యలో కదిలి రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ అభయాహస్తo పథకం రు,,12 లక్షలు వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు,నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి పినపాక మండల కన్వీనర్ జిమ్మిడి సుమన్ ఎస్సీ కులాల జిల్లా సీనియర్ నాయకులు సోంపల్లి తిరుపతి, కుమ్మరి వెంకటేష్, కొప్పుల వీరస్వామి, కోళ్ల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now