Headlines :
-
సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
తెలంగాణలో ధాన్యం పండింపు రికార్డు, సంక్రాంతి తర్వాత సన్న బియ్యం రేషన్ లో
-
సూర్యాపేట పర్యటనలో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
సూర్యాపేట: సన్నబియ్యంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈసారి ధాన్యం ఎక్కువగా పండిందని తెలిపారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని అన్నారు. సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇవాళ(ఆదివారం) సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ స్కూల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయని ప్రకటించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభ్యులు కారు.. వీరంతా తమ కుటుంబ సభ్యులు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.. కేపి