అరచేతిలో వైకుంఠం చూయిస్తూ..
రాష్ట్ర ప్రజల కళ్ళల్లో కారం కొట్టిండ్రు..
పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని చెబుతున్న కాంగ్రెసోళ్లు…
ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలననా?
కం ట్రోల్ తప్పిన లా అండ్ ఆర్డర్*
తెలంగాణ రాష్ట్ర లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని అన్నారు. రోజురోజుకి ఆడబిడ్డల పైన అత్యాచా రాలు, ప్రశ్నిస్తే నిర్భంధాలు,డ్రగ్స్ కి అడ్డాగా తెలంగాణ మారుతుందని ఆరోపించారు. ఇక రాజకీయ పరిస్థితులు చుస్తే మన ముఖ్యమంత్రి పులి తోలు కప్పుకున్న మేకల ఉందని విమర్శించారు. ఎప్పుడు ముఖ్యమంత్రి సిటు పోతుందనే భయంలో ఉన్నారని విటన్నిటిని చుస్తే కాంగ్రెసొళ్ళు చెప్పే ఇందిరమ్మా ఎమర్జెన్సీ పాలన వస్తదా అని అనుమానం కలుగుతుందన్నారు.
420 గానే గ్యారంటీలు* ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్ల, 420 హామీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో అమలుచేస్తానన్నా హామీలకు పెద్ద గాడిద గుడ్డు పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. మహి ళలకు ఇస్తానన్న రూ.2500,ఇందిరమ్మ ఇండ్లు,విద్యార్థులకు విద్య భరోసా 5 లక్షలు , చేయూత కింద పెన్షన్ 4000 ల పెంపు విటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో గాడిద గుడ్డు ప్రవేశపెట్టిం దన్నారు. డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ సబ్బండా వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరుతో మోసం చేసిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు 15000,వరి పంటకు బోనస్ 500,24 గంటల నిరంతర ఉచిత కరెంటు అని
• ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు అనేక ఆంక్షలతో, నిబంధ నలతో కొంత మందికే రుణమాఫీ చేసి మిగతా గ్యారంటీలకు శతగోపం పెట్టింద న్నారు. అర్హులైన రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల ముందు ధర్నా చేసే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యావత్ నిరుద్యోగులను, యువతను యూత్ డిక్లరేవోషన్ పేరుతో మోసం చేసిందన్నారు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామ ని,నిరుద్యోగ భృతి 4 వేలు అని,జూన్ నాటికే జాబ్ క్యాలండర్ ప్రకటిస్తాం అని, బిజెపి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మొన్న మంత్రి మండలి ఆమోదం చేసారన్నారు.సెప్టెంబర్ నాటికీ నియామకాల భర్తీ అన్నారు యావ త్ తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారు తక్షణమే నియామకాల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు.కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టకపోవడం సిగ్గు చేటు. రేవంత్ సర్కార్ తన పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు మాత్రం కులానికో కార్పొరేషన్ పెట్టి పదవులు ఇచ్చి జీతాలు చెల్లిస్తుంది కానీ ఆ కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టకపోవడం సిగ్గు చేట న్నారు. ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగ నాయకుల పైన ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ నిరుద్యోగుల పైన లేదా అని ప్రశ్నించారు.బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఇంది ర మ్మా రాజ్యస్థాపన అంటు గొప్పలు చెప్పే కాంగ్రెస్, రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగాఎస్సీ ఎస్టీ బీసీవర్గాలను మోసం చేసిందన్నారు. చేవెళ్ల స్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో దళిత, గిరిజనులను మోసం చేసిందన్నారు. అంబేద్కర్ అభయ అస్తం పేరుతో వారికీ ఇస్తానన్న 12 లక్షలు ఎక్కడ పోయినాయి దళిత గిరిజనుల పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమా ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో 50% పైన ఉన్న బీసీ వర్గాన్ని వంచించింది ఈ కాంగ్రె స్ ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం 9 వేల నిధులు కేటాయించింది అంతే కాకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లో 23% నుండి 42 % పెంచుతామన్నా హామీని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేసారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందటు రాష్ట్రాన్ని కాళేశ్వరం పేరుతో దోచుకుంది అంటూనే ఈ కాంగ్రెస్ ప్రభు త్వం కూడా రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్పగా చేసి చివరికి రాష్ట్రాన్నే అమ్మే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంద న్నారు.డబుల్ బెడ్ రూమ్ నాగారంలో 396,బైపాస్ 252 అర్హులైన వారికీ కేటాయించాలని అవి ప్రస్తుతం శిథిల వాస్తలో ఉన్నాయన్నారు. జీవో కి వ్యతి రేకంగా ఎంపిక చేసిన లిస్ట్ రద్దు చేసి అర్హులైన వారికీ కేటాయించాలని డిమాండ్ చేశారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్, ముత్యం పేట్ షుగర్ ఫ్యాక్టరీ చేరిపించడమే కాకుండా అభివృద్ధికి నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
ఓడిపోయిన అభ్యర్థులకు పెత్తనం ఇస్తే ఊరుకోం..
నియోజకవర్గలలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడానిన్ని తీవ్రంగా ఖండిస్తు న్నట్లు ఎమ్మెల్యే ధ్వజ జమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసంతో ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను కాకుండా ప్రజల ప్రజలు తిరస్కరించిన వారికీ నిధులు ఇచ్చి కమీషన్లకు దోపిడీకి తేర లేపాలని చుస్తే ఊరుకోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోబీజేపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు..