ప్రధాన రహదారినీ బాగా చేయించండి సార్

Headlines :
  • మణుగూరు ప్రధాన రహదారి మరమ్మతులకు కర్నె రవిచే వినతి
  • అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఎదురైన ఇబ్బందులు
  • జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను కలసి కర్నె రవి వినతి పత్రం అందజేశారు
  • రహదారిపై ఉన్న పెద్ద గోతులు – వెంటనే చర్యలు అవసరం
  • ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రజా ప్రతినిధులకు కర్నె రవిల మండలికి ప్రశ్న

కలెక్టర్ కు సామాజిక కార్యకర్త, లాయర్ కర్నె రవి వినతి

మణుగూరు, : మణుగూరు ఏటునాగారం
ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ప్రజలు వాహనదారుల ఇబ్బం
దులను గుర్తించి రహదారిని బాగు చేయిం
చండి.సార్ అంటూ సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది కర్నె రవి అధికారు
లను డిమాండ్ చేశారు. గత కొన్ని సంవ
త్సరాల నుండి రహదారి అధ్వానంగా ఉన్న
ఏమాత్రం అధికారులు పట్టించుకోవ
టం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేర
కు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ జితే
ష్ వి. పాటిల్ ను కలసి వినతి పత్రం అంద
జేశారు. అనంతరం రవి విలేకరులతో మా
ట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఈ రహదారిని పున
రుద్ధరించ లేదని, మరమత్తులు చేపట్ట
లేదని, ఆయన విమర్శించారు. జిల్లాలో అన్ని
ఎమ్మెల్యేల స్థానాలు, ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ కు ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తే అధి
కారం చేపట్టిన తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రజానీకానికి గుంతల రోడ్లు బహుమానం
గా ఇచ్చిందని ఆయన ఘాటుగా విమర్శిం
చారు. గెలపొందిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? ప్రజల గోడు పట్టదా ప్రజల జీవన పరిస్థితి పట్టదా ? ప్రజలకు సమాధా
నం చెప్పాలని ఆయన నిలదీశారు. మణు
గూరు నుండి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు నుండి ప్రధాన రహదారి పెద్ద గోతులతో దర్శనమిస్తుందని, ప్రజలు వెళ్లాలన్న తిరిగి మణుగూరు కి రావాలన్నా అనేక అవస్థ
లు పడాల్సి వస్తుందన్నారు. రోడ్డు అడుగ
డుగునా గుంతలు పడుతున్నా, అనేక ర
కాల ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా చేయలే
దంటే ప్రజానీకం పట్ల, ప్రజల రవాణా పట్ల వారికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన తెలిపారు. భారీ గోతులు కంకర తో దుమ్ము దూళితో ప్రజల నరకయాతన కనీసం రోడ్డు మర
మ్మతులు చేపట్టాలన్న ఇంకిత జ్ఞానం కూ
డా ప్రజాప్రతితులు లేకపోవడం దురదృష్ట
మని ఆయన విమర్శించారు.గతంలో తూ
తూ మంత్రంగా అధికారులు మరమ్మతు
లు చేతులు దులుపుకున్నారని పేర్కొన్నా
రు.మణుగూరు ప్రధాన రహదారి కనుక రహదారి మరమ్మతులను తక్షణమే చే
యాలని కోరారు. రహదారి మార్గమధ్యలో గోతులను కూడా పూడ్చాలన్నారు.ఇప్పటి
కైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుండి రోడ్ల నిర్మాణం కోసం, మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అ
లా చేపట్టకపోతే రాబోయే కాలంలో రహ
దారులు దిగ్బంధనం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now