ట్రాఫిక్ నియంత్రణపై ఉన్నత అధికారులతో సమీక్షా – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 05:

నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకై అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మున్సిపాల్ కమిషనర్ దిలీప్ కుమార్ , ట్రాఫిక్ ఏసీపీ నారాయణలతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

నగరంలో విచ్చలవిడిగా ఫుట్ ఫాత్ నిర్మాణాలు కబ్జాలు చేయడం వలన ట్రాఫిక్ నియంత్రణ కావడం లేదని తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను, ట్రాఫిక్ ఏసీపీని ఆదేశించడం జరిగింది. నగరంలో రోడ్లపై కూరగాయలు, తోపుడు బండ్లతో వ్యాపారాలు కొనసాగించడం వలన అత్యవసర సమయాల్లో అంబులెన్సు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని వీధి వ్యాపారాలు చేసుకునే వారిని తక్షణమే రైతు బజారులోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చెత్త సేకరణలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు, నగరంలో ఫుట్ పాత్ ను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

నగరంలో పలు చోట్ల చెత్త వ్యర్థలను సరిగా తొలగించడం లేదని మార్కెట్ వంటి పరిసరాలలో కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోయి ఉండటం వల్ల, డ్రైనేజీ వ్యర్థలను పూర్తిగా తొలగించని కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడాల్సి వస్తుందని ఇలాంటివి పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు ప్రతేక చొరవ తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధికి,నాయకులు,ప్రజలు అధికారులు అందరు సమన్వయంతో పని చేయాలనీ సూచించారు.
ఈ కార్యక్రంలో ట్రాఫిక్ సీఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now