*బెల్ట్ క్లీనింగ్ కాంటాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి*

శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సి ఎస్ పి ఇంజనీర్ అల్లారి నిరంజన్ బాబు కి వినతి పత్రం అందజేసిన బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని, శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు)ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక కొండాపురం సిఎస్ పి ఇంజనీర్ అల్లారి నిరంజన్ బాబు కి కాంటాక్ట్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ (సి ఎస్ పి) లేదా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సి హెచ్ పి) లలో బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు అన్ స్కిల్డ్ వర్కర్లుగా పరిగణించి వేతనాలు చెల్లిస్తున్నారని. నిజానికి వీరు చేస్తున్న పని నైపుణ్యతతో కూడుకున్న పని అని అన్నారు. దుమ్ము ధూళి తోపాటు చమ్మాస్ తో కింద పడిన బొగ్గును తిరిగి కన్వేయర్ బెల్ట్ పైకి ఎత్తి పోయటం ఫలితంగా దీర్ఘకాలికంగా నడుము నొప్పికి గురి అవుతారని ఒంటినిండా బొగ్గు మసితో తిరిగి ఇంటికి వెళితే ఇంటి వాళ్ళు కూడా గుర్తుపట్టనంతగా తయారవుతారని వారి శ్రమ వేల కట్టలేనిది అన్నారు.ఎప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమ శ్రమను గుర్తించి న్యాయం చేస్తుందని గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని దయచేసి బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్ట్ క్లీనింగ్ కాంటాక్ట్ కార్మికులు జి సంజీవరావు, పి భద్రం, బి కృష్ణ, బి నాగేష్, పి వెంకటేశ్వర్లు, ఆర్ లింగయ్య, పి లక్ష్మీనారాయణ, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now