ఏజెన్సీ చట్టాలు భూస్వాములకు చుట్టాలుగా మారాయి

న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు

చర్ల మండలం గోదారి పక్కనే ఉన్న కూర గడ్డ భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో ఉన్నాయని అవి ఆదివాసి ప్రజలకు పంచాలని చర్ల తాసిల్దారు శ్రీనివాస్ కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈరోజు చర్ల మండలంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది.ధర్నా కు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏఐటిఎఫ్ జిల్లా నాయకులు గొంది ముయన్న అధ్యక్షత వహించగా ముసలి సతీష్ మాట్లాడుతూ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఆదివాసి హక్కులని కాలరాస్తూ పీసా,1/70 యాక్ట్ లను తుంగలో తొక్కుతూ ఇక్కడే పుట్టి పెరిగిన ఆదివాసీల్ని పక్కకు నెడుతూ భూస్వాముల చేతుల్లోకి తరలిస్తున్నారని. అట్టి భూములను ఇవ్వమని అడిగిన చట్టాలు వర్తింప చేయండి అని చెప్పిన పాలకులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. దండుపేట కొత్తపల్లి లింగాపురం కొంపల్లి సి కొత్తూరు ఆనంద కాలనీ కత్తి గూడెం ఆదివాసీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కూడు గూడు నోచుకోకుండా భూస్వాముల చేతుల్లో వెట్టిచాకిరి చేస్తూ జీవితం సాగిస్తున్న ఆదివాసీలకు ఇక్కడ భూములు లేవు గాని ఎక్కడ నుంచే వచ్చిన భూస్వాములకు వేల ఎకరాలు ఎలా వచ్చాయో తెలపాలని వారు అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ అవి ఉన్నోడికి చుట్టాలుగా మార్చుకుంటున్నారు తప్పితే నిజమైన ఆదివాసీలకు న్యాయం జరగడంలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తక్షణమే భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను ఆదివాసి ప్రజలకు పంచాలని లేకుంటే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసి ప్రజలకు పంచుతామని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం అధ్యక్షుడు దుబ్బరాజు, కార్యదర్శి పునెం రవి కిరణ్, కోరం చిన్న ముత్యాలు, కాక వీరన్న, ఇర్ఫా అరుణ్ కుమారు,సబ్కా అశోక్ కాక వెంకటేష్, దుబ్బ సమ్మయ్య ,మహిళా సంఘం నాయకురాలు తెల్లం సుశీల ఇర్ప సారమ్మ, బంధ సంధ్య కోరం భద్రమ్మ, సోడి సూర్య భవాని, పి అనూష ఇర్ఫా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now