ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలియజేశారు.
కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అధికారులు,సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఈ శిబిరాన్ని ఏర్పాటుచేశారు.ఈసిజీ,
గైనకాలజీ,బీపి,షుగర్,దంత సమస్యలు,కళ్ళ పరీక్షలు,ఆర్థోపెడిక్,యురాలాజీ,ఫిజియోతెరపి,గుండె సంభంధిత పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసే విధంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో భర్తీ అయినప్పుడు కఠినమైన శిక్షణతో,పూర్తి శారీరక సామర్థ్యంతో,ఆరోగ్యంగా శిక్షణా కేంద్రాల నుండి ప్రజలకు సేవలు అందించడానికి బయటకు రావడం జరుగుతుందన్నారు.ఆ తర్వాత విధులలో చేరినప్పటి నుండి నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో పాటు,ప్రజలకు సేవలందిస్తూ పోలీసులు విశ్రాంతి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది అన్నారు.చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించాల్సి వస్తుందని,అందుమూలంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.పోలీసులు అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అన్నారు.అందుకే జిల్లాలో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో సబ్ డివిజన్ల వారీగా పోలీసు అధికారులు,సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని సూచించారు.ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ తో పాటు సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు.అదేవిధంగా నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తూ,తాము అడగగానే పోలీస్ కుటుంబాలకు కూడా వైద్య చికిత్సలు చేయడానికి విచ్చేసిన వైద్య బృందానికి కూడా ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.వైద్య వృత్తి కూడా చాలా బాధ్యతాయుతమైన వృత్తి అని కొనియాడారు.అనంతరం ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులందరినీ శాలువాలు,మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,పట్టణంలోని ప్రముఖ వైద్యులయిన నాగరాజు,కృష్ణ ప్రసాద్,రంగారావు, రాజశేఖర్,ప్రవీణ్,సీఐలు వెంకటేశ్వర్లు కరుణాకర్,రమేష్,శివప్రసాద్,ఇంద్రశేనారెడ్డి,ఆర్ఐలు సుధాకర్,కృష్ణారావు,నరసింహారావు,లాల్ బాబు మరియు ఇతర పోలీసులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు అధికారులు సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి జిల్లా ఎస్పీ
by Naddi Sai
Published On: November 6, 2024 8:16 pm
