Headlines in Telugu
-
జనన మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
-
ప్రజలకు సులభతరం: అవినీతి రహిత ధ్రువీకరణ పత్రాలు
-
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సౌజన్యంతో ప్రజలకు ప్రత్యేక సేవలు
*ఇక సులభతరం*
*జనన మరణ ధ్రువీకరణ పత్రాలకు డబ్బులు ఇవ్వకండి*
*ప్రజలకు సౌకర్యం కోసం ప్రత్యేక కౌంటర్లు*
*ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అదేశలతో యుద్ధ ప్రతిపదికన కౌంటర్లు ఏర్పాటు*
ప్రస్తుతం పాఠశాలలో పేరు మొదట ఆధార్ కార్డు లలో సర్ నేమ్ తప్పకుండా ఉండాలని ఉపాధ్యాయులు చెప్పడంతో.. అందుకు ప్రూఫ్ గా బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కేంద్రాల్లో అడగడంతో జనన ధ్రువీకరణ పత్రాలు కోసం విద్యార్థుల తల్లి తండ్రులు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం జాతర తలపించే విధంగా వెళుతున్నారు. ఇది కొందరు ఉద్యోగులు ఆసరాగా తీసుకుని వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయం తెలుసున్న శాసన సభ్యులు శ్రీ *అమిలినేని సురేంద్ర బాబు * సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కమిషనర్ కు తగు చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్రాలు మంజూరు చేసేలా చూడాలని ఆదేశించారు. స్పందించిన కమిషనర్ వంశీ కృష్ణ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. యుద్ధ ప్రతిపదికన సచివాలయం సిబ్బందితో మున్సిపాలిటీ కార్యక్రంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసారు. కౌంటర్లలో ప్రజలు మీ పేరు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకుని ఆఫీస్ రుసుము మాత్రం చెల్లించి వెళితే మరుసటి రోజు మా సిబ్బంది మీకు ఫోన్ చేసి సర్టిఫికెట్ మంజూరు చేస్తారని, ఎవరికీ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా ఆలా అడిగితె తమ దృష్టికి తీసుకురావాలని అయన కోరారు. గత నాలుగు నెలల నుండి జనన మరణం ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయలేదని ఆ నెలలసంబంధించి పత్రాలను తాము సిద్ధం చేసి ఫోన్ చేసి వారికీ చేరేలా చేస్తున్నామన్నారు. రెండు వారల్లో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు అప్ డు డేట్ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ జనన మరణ పత్రాల కోసం వేలాది రూపాయలు ఇవ్వడమే కాకుండా ఎంతో వ్యయ ప్రయాసలు పడే వారమణి తాజాగా ఎమ్మెల్యే నిర్ణయం తో సులభం తరమయిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఆర్డిటి అస్పత్రిలో చుట్టూ ప్రక్కల నియోజకవర్గలతో పాటు కర్ణాటక రాష్ట్రo నుండి కూడా ఇక్కడకు వచ్చి డెలివరీ నెలలో వేలాది మంది అవుతుందడంతో ఈ జనన ధ్రువీకరణ పత్రాలు కోసం మున్సిపాలిటీలో ప్రజలు తాకిడి ఎక్కువ ఉండటం తెలిసిందే..