విద్యార్థులకుగొడ్డుకారంతో భోజనం..!!

*గొడ్డు కారంతో మధ్యాహ్న భోజనం*

*శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి*

ప్రశ్న ఆయుధం 04 ఆగష్టు(బాన్సువాడ ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం గొడ్డు కారం పొడితొ నిర్వాహకులు అన్నం పెట్టారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎందుకు కారం పొడితొ తింటున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.కూర సరిగ్గా వండటం లేదని వారు జవాబు ఇచ్చారు.అనంతరం విద్యార్థుల తల్లి తండ్రులు అన్నం వండి పెట్టే ఏజన్సీ మహిళలను అన్నం వండకుండా అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు.డిఇఒ దుర్గ రావు పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నిర్వహకుల పై ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా సాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now