గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం* *ఒకరు మృతి మరొకరు తీవ్ర గాయాలు*..

IMG 20241108 WA0096

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం* *ఒకరు మృతి మరొకరు తీవ్ర గాయాలు*.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రము మహబూబాబాద్ రోడ్డు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా ఉంది . పూర్తి వివరాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణ పెళ్లికి చెందిన గుర్రం సంజయ్ మచ్చలకు చెందిన కప్పల బన్నీ అనే ఇద్దరు స్నేహితులు బైక్ పై ఇంటికి వెళ్తున్నారు .ఈ క్రమంలో మహబూబాబాద్ నుండి గూడూరు వైపు వస్తున్న బోలేరో వాహనం బలంగా ఢీకొట్టింది . దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా నర్సంపేటకు తరలిస్తుండగా గుర్రం సంజయ్ (18) మార్గమధ్యలో మృతి చెందాడు . కొప్పుల బన్నీ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు పూర్వాపరాలు పరిశీలిస్తుట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now