భ‌విష్య‌త్తుత‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా రూప‌క‌ల్ప‌న‌.

తెలంగాణలో కొత్త రెవెన్యూ చ‌ట్టం,2024. 

దేశంలో భూసంస్కరణల్లో ఇది పెనుమార్పు కానుంది…!

భ‌విష్య‌త్తుత‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా రూప‌క‌ల్ప‌న‌

ఆర్వోఆర్ చ‌ట్టం-2024 ముసాయిపై డీసీఏ చ‌ర్చా కార్య‌క్ర‌మం.

సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డికి అభినంద‌న‌లు..

18 రాష్ట్రాల చ‌ట్టాల‌ అధ్య‌య‌నంతో ముసాయిదా తయారీ..

భూధార్‌, ఆబాదీకి హక్కుల రికార్డ్ తో ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగనుంది.

గ్రామాల్లోనే భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అయ్యే వ్య‌వ‌స్థ‌.

 

కొత్త రెవెన్యూ చ‌ట్టం.. పేద‌ల‌కు, రైతుల‌కు చుట్టంగా మార‌నుంద‌ని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. ఒక్క‌రిద్ద‌రి అవ‌స‌రాల కోసం కాకుండా తెలంగాణ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు త‌రాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డే విధంగా ఆర్వోఆర్ చ‌ట్టం -2024 ముసాయిదా ఉంద‌న్నారు. ప్ర‌పంచంలో, దేశంలో మారుతున్న ప‌రిస్థితుల‌కు, రోజురోజుకు పెరిగి పోతున్న ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఙానానికి అనుగుణంగా చ‌ట్ట రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆర్వోఆర్ చ‌ట్టం-2024 ముసాయిదాను ప్ర‌జాభిప్రాయం కోసం ప‌బ్లిక్‌డొమైన్‌లో ఉంచ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. రైతుల‌కు, పేద‌ల‌కు ఈ చ‌ట్టంతో రెవెన్యూ సేవ‌లు సుల‌భంగా, వేగంగా అంద‌డంతో పాటు రెవెన్యూ వ్య‌వ‌స్థ కూడా బ‌లోపేతం కానున్న‌ట్టుగా తెలిపారు. ప్ర‌జాపాల‌న‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీ‌నివాస్‌రెడ్డితో పాటు సీసీఎల్ఏ న‌వీన్ మిత్త‌ల్ కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం-2024 తెచ్చి రైతుల‌కు మేలు చేస్తూ, రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ఎంతో కృషి చేశార‌ని వారి సేవ‌ల‌ను కొనియాడారు.డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఆర్వోఆర్ చ‌ట్టం-2024 ముసాయిదాపై బేగంపేట‌లోని టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని డిప్యూటీ క‌లెక్ట‌ర్లు, త‌హ‌శీల్దార్ల‌తో చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా భూ చ‌ట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్‌, ఉస్మానియా వ‌ర్సిటీ లా ప్రొఫెస‌ర్ జీబీరెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారులు ర‌వీంద్ర‌బాబు, బాల‌రాజు, డిప్యూటీ క‌లెక్టర్లు కె.రామ‌కృష్ణ‌, ర‌మేష్ లొలేవార్ పాల్గొని మాట్లాడారు.

 

*రాజ్యాంగం త‌ర‌హాలో కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం రూప క‌ల్ప‌న:భూమి సునీల్‌కుమార్‌*దేశానికి, దేశంలోని అన్ని వ‌ర్గాల‌ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా భార‌త రాజ్యాంగం ఏ విధంగానైతే రూప‌క‌ల్ప‌న జ‌రిగిందో.. అదే త‌ర‌హాలో కొత్త ఆర్వోఆర్ చ‌ట్టం-2024 ముసాయిదా ఉంద‌ని భూ చ‌ట్టాల నిపుణులు భూమి సునీల్ పేర్కొన్నారు. రాజ్యాంగం రూప‌క‌ల్ప‌న స‌మ‌యంలోని ప్ర‌పంచ దేశాల‌లో ఉన్న మంచిని తెచ్చి మ‌న రాజ్యాగంలో రాసుకున్న‌ట్టుగా.. ఈ చ‌ట్టంలో కూడా దేశంలోని 18 రాష్ట్రాల‌లో ఉన్న ఆర్వోఆర్ చ‌ట్టాల‌ను త‌రువుగా అధ్య‌య‌నం చేసి అందులో ఉన్న మంచిని తీసుకున్న‌ట్టుగా తెలిపారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే 1936, 1948,1971, 2020ల‌లో మొత్తం నాలుగు సార్లు ఆర్వోఆర్ చ‌ట్టాలు వ‌చ్చాయ‌న్నారు. ఇప్ప‌డు రాబోయే ఐదో ఆర్వోఆర్ -2024 చ‌ట్టానికి ప్ర‌త్యేక‌త ఉంద‌న్నారు. రాబోయే 10-20 ఏళ్ల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చ‌ట్ట రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌న్నారు. స్వాధీనంలో భూమి, చేతిలో ప‌ట్టా, రికార్డులో పేరు ఈ మూడు ఉన్న‌ప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హ‌క్కులు ద‌క్కుతాయ‌న్నారు. వీటి కేంద్రంగానే కొత్త చ‌ట్టం ఉండ‌బోతుంద‌న్నారు. వ్య‌వ‌సాయ భూముల‌కు ఏ విధంగానైతే భూమి హ‌క్కుల రికార్డు ఉంటుందో.. కొత్త చ‌ట్టంలో వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు కూడా భూమి రికార్డు రాబోతుంద‌న్నారు. దేశంలో వ‌స్తున్న మార్పుల‌కు, కేంద్ర ప్ర‌భుత్వం తెస్తున్న భూ విధానాల‌కు అనుగుణంగా కొత్త చ‌ట్టం ఉంద‌న్నారు. కొత్త చ‌ట్టంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కంటే.. స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయాల‌ని కోరారు.కొత్త చ‌ట్టంతోనే రైతుల‌కు సేవ‌లు చేరువ‌-రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతం వి.ల‌చ్చిరెడ్డి, అధ్య‌క్షులు, డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌*రాష్ట్రంలో రెవెన్యూ వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యం కావ‌డంతో రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు సేవ‌లు దూర‌మ‌య్యాయ‌ని ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందాలంటే కొత్త ఆర్వోఆర్ చ‌ట్టంతోనే సాధ్య‌మ‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేం చేస్తూ రైతుల‌కు భూ స‌మ‌స్య‌ల‌ను ప‌ర‌ష్క‌రించేందుకే కొత్త చ‌ట్టం యొక్క ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింద‌న్నారు. చ‌ట్టం అంటే ఎక్క‌డో కూర్చేని చేస్తే దాంతో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అంద‌వ‌న్నారు. ప్ర‌జ‌ల నుంచే చ‌ట్టం రావాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం యొక్క ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచింద‌న్నారు. గ‌త పాల‌కులు చ‌ట్టాన్ని చేసి ప్ర‌జ‌ల ముందుకు తెచ్చేవార‌ని గుర్తు చేశారు. ఈ ప్ర‌జా ప్ర‌భుత్వం ముసాయిదాను తీసుకొచ్చి ప్ర‌జాభిప్రాయాల్ని కోర‌డం అనేది ఒక చ‌రిత్ర‌గా పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌లో పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింద‌న్నారు. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని చ‌ట్ట రూపొందించిన‌ట్టుగా తెలిపారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రూల్స్‌ను కూడా మార్చుకొనే వెసులుబాటు ఈ చ‌ట్టంలో ఉంద‌న్నారు. గ‌తంలో వ‌చ్చిన చ‌ట్టాల కంటే దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంద‌న్నారు. ఈ కొత్త చ‌ట్టంతో క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ సేవ‌లు అంద‌డంతో పాటు స‌మ‌స్య‌ల‌ను కూడా అక్క‌డే ప‌రిష్క‌రించునే విధానం రాబోతుంద‌న్నారు. గ్రామానికో రెవెన్యూ అధికారి కూడా అందుబాటులో ఉంటూ సేవ‌లంధించే రోజులు కూడా రాబోతున్నాయ‌న్నారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లంగా ఉంటేనే ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు స‌కాలంలో అందుతాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టంలో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చిన రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి సీసీఎల్ఏకు రావాల్సిన ప‌రిస్థితి ఉంద‌న్నారు. కొత్త చ‌ట్టంలో అధికారుల వికేంద్రీక‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు గ్రామ‌, మండ‌ల స్థాయిలోనే అన్ని ర‌కాల సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

 

*రైతులు కోర్టుల మెట్లు ఎక్కాల్సిన అవ‌స‌రం ఉండ‌దు:ప్రొ.జీబీరెడ్డి, ఓయూ*

ప్ర‌స్తుతం ఉన్న ఆర్వోఆర్ చ‌ట్టంతో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప్రొ.జీబీరెడ్డి పేర్కొన్నారు. రైతులు ఏదో ఒక‌టి, రెండు విష‌యాల‌కు త‌ప్ప మిగ‌తా ప్ర‌తి దానికి కోర్టుకు వెళ్ల‌డం చాలా ఇబ్బందిగానే కాకుండా భారంగా కూడా ఉంద‌న్నారు. ఇది సాధార‌ణ రైతులకు సాధ్యం కాని ప‌నిగా మిగిలిపోయింద‌న్నారు. 2020 ఆర్వోఆర్ చ‌ట్టంతో అప్పిల్‌, రివిజ‌న్ చేసే మెకానిజం లేద‌న్నారు. కొత్త చ‌ట్టం ముసాయిదా ప్ర‌కారం ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు రెవెన్యూ సేవ‌లు అందుబాటులో ఉండేలా ఉంద‌న్నారు. దీనిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని చ‌ట్టంగా అందుబాటులోకి తెస్తే రైతుల క‌ష్టాలు తీరుతాయ‌న్నారు. ఈ చ‌ట్టం అత్యున్న‌మైన చ‌ట్టంగా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. అంతే కాకుండా ప్ర‌జ‌ల‌కు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంద‌న్నారు. రెవెన్యూ అధికారుల‌కు, ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు మేలు చేసే చ‌ట్టంగా ఇది ఉంటుంద‌న్నారు. ఈ ముసాయిదాను వెంట‌నే చ‌ట్టంగా చేసి వెంట‌నే అమ‌ల్లోకి తేవాల‌ని కోరారు.కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌, మ‌హిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్ఆర్ స‌రిత‌, వైస్‌ ప్రెసిడెంట్లు శకుంత‌ల‌, శ్రీ‌నివాస్‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఎస్‌.రాములు, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఎల్‌.పూల్‌సింగ్ చౌహాన్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక‌, మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు పి.రాధా, కోశాధికారి శ్రీ‌నివాస‌శంక‌ర్‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now