ఎమ్మెల్యే మీరు రాజీనామా చేస్తే మాకు రెండో విడత దళిత బంధు వస్తుంది

*దళిత బందు కోసం ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేస్తే రెండో విడుత దళిత బంధు వస్తుంది*

*తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ రాచపల్లి సాగర్*

*జమ్మికుంట నవంబర్ 9 ప్రశ్న ఆయుధం::-*

దళిత బంధు కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రెండవ విడత దళిత బంధు వస్తుందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ రాచపల్లి సాగర్ అన్నారు తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం నియోజక వర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాచపల్లి సాగర్, పుల్యాల నరేష్ మాట్లాడుతూ ప్రాణత్యాగం చేస్తా అంటున్నారు కదా ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి దళితబంధు రాకపోతే ప్రాణ త్యాగం అవసరం లేదని మీరు ఏంఎల్ఎ పదవికి రాజీనామా చేస్తే చాలు అని వారు పేర్కొన్నారు ఒకప్పుడు దళిత బంధు ఆపింది మీరేనని మళ్ళీ ఇవ్వాలి అనడం విడ్డురంగా వుందని గుర్తు చేశారు.ఎంఎల్ఎ ఎలక్షన్ లో భాగంగా దళితబంధు రెండో విడుత వస్తే తను గెలువని తెలిసి రెండో విడుత నిధులను ఆపివేసి తరువాత తాను ఎంఎల్ఎ గెలిచాక హుజురాబాద్ ప్రజలు తనను ఏం అంటారో అని తెలిసి ఫ్యామిలీ అడ్డుపెట్టుకొని ఎలక్షన్ గెలిచిన తరువాత దళితబంధు ఇవ్వాలని ప్రజలను తప్పు త్రోవ పట్టించే విధంగా హుజురాబాద్ రణరంగం కావాలని ప్రజలను రెచ్చగోట్టె మాటలను మాట్లాడుతున్నారని వారు తెలిపారు.నాకు మీరు 9వ తేదిన దరఖాస్తులు ఇవ్వాలని చెప్పడం మీరు ఎంఎల్ఎ గా ఉన్నారని మీరు ఒక ఫోన్ కాల్తో ఇ.డి. లేదా కలెక్టర్ ద్వారా ఒక రిపోర్టు తీసుకొని వెళ్ళి ప్రజల తరుపున మాట్లాడాలి గాని ఆది కాకుండా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తు వారిపై కేసులు, లారీచార్జి అయ్యేలా వ్యవరిస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలో భయంక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు గాను మీరు చెయాలిసింది మీ ఎంఎల్ఎ పదవిని మా దళితుల కోసం త్యాగం చెస్తే సరిపోతుందని ఎందుకంటే బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల దళితబంధు వచ్చిందని అందుకని ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే దళితబంధు రెండో విడుత హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలకు వస్తుందని ఆన్నారు.ఈ కార్యక్రమoలో తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు పులాల నరేష్,జిల్లా కార్యదర్శి సలిగంటి సతీష్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాచపల్లి సాగర్, మండలం నాయకులు రాచపల్లి రాజశేఖర్, శనిగరపు తరుణ్, రాచపల్లి వంశీ, రాజు, నవీన్, గణేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment