ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి..
-వివాహ వేడుకలో విషాదం, జనగాం జిల్లాలో వివాహ రిసెప్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం
-మరో 5 నిమిషాల్లో తమ ఇంటికి చేరేలోపే జరిగిన ప్రమాదం
జగిత్యాల జిల్లా కరీంనగర్ ప్రధాన రహదారిపై ధరూర్ గ్రామ కెనాల్ ఆదివారం వద్ద తెల్లవారు జామున 4-30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును అతి వేగంతో ఉన్న కారు ఢీకొట్టడం తో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న జగిత్యాల హనుమాన్ వాడకి చెందిన సంకీర్త్ అనే యువకుడు, అతని పక్కనే ఉన్న మరో యువతి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెనుకనున్న రాయమల్లు, ఆయన భార్యకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్.
ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి..
by kana bai
Published On: November 10, 2024 3:28 pm