కోడలిని టీవీ చూడనీయకపోవడం క్రూరత్వం కాదు బాంబే హైకోర్టు..

కోడలిని టీవీ చూడనీయకపోవడం క్రూరత్వం కాదు బాంబే హైకోర్టు..

-అత్తింటివారికి విధించిన శిక్షను కొట్టివేసిన బాంబే హైకోర్టు

కోడలిని టీవీ చూడనివ్వకపోవడం, కార్పెట్ పై పడుకోమనడం క్రూరత్వం కిందికి రాదని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. ఐపీసీ 498ఏ ప్రకారం ఇవి ఇంటి వ్యవహారాలకు సంబంధించినవని, శారీరక, మానసిక క్రూరత్వాన్ని కలిగి ఉండవని బెంచ్ పేర్కొంది. ఈ ఆరోపణలపై బాధితురాలి భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులకు విధించిన శిక్షను కొట్టివేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తనను అత్తింటి వారు టీవీ చూడనివ్వడం లేదని, కార్పెట్ పై పడుకోమంటున్నారని, గుడికి వెళ్లనివ్వడం లేదని, పొరుగువారిని కలవనివ్వడం లేదని, రాత్రి 1.30 గంటకు మంచి నీళ్లు తెప్పించారని ఆరోపిస్తూ భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం 2002 మే 1న ఆమె సూసైడ్ చేసుకుంది. అయితే, భర్త, అత్తమామలు వేధించడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ అల్లుడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయిల్ కోర్టు మృతురాలి భర్త, అతడి కుటుంబ సభ్యులకు శిక్ష విధించి జైలుకు పంపించింది. దీంతో, ట్రయిల్ కోర్టు తీర్పును వారు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ లో సవాల్ చేశారు.
జస్టిస్ అభయ్ ఎస్ వాఘ్వాసే నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ వారి పిటిషన్ పై విచారణ జరిపింది. ఐపీసీ 498ఏ ప్రకారం వారి ఆరోపణలను క్రూరత్వ నేరం కింద తీవ్రమైనవిగా పరిగణించలేమని తెలిపింది. అలాగే, మహిళ సూసైడ్ కు రెండు నెలల ముందు భర్త, అత్తింటి వారితో ఆమెకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదని గుర్తుచేసింది. దీంతో వారి వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో భర్త, అతడి కుటుంబ సభ్యులకు దిగువ కోర్టు విధించిన శిక్షను కొట్టివేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment