నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 11:
నిజామాబాద్ నగరం ఖాళీల్ వాడి లో ఉన్న జిల్లా కేంద్ర గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న పేద విద్యార్థులకు శ్రీ ధన్ పాల్ లక్ష్మీభాయ్ & విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దాదాపు రెండువందల మందికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అని తెలిపారు. నిరుద్యోగులు అంత ఏకమై ఆనాడు పోరాడితే తెలంగాణ వస్తే మన కొలువులు మనకు వస్తాయి అని కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టి, నిరుద్యోగులను ఉరితాళ్లకు ఎలాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రకటించిన యువ డిక్లరేషన్ లో ఉన్న హామీలన్నీ అమలు చేయాలన్నారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు ఏడాది పూర్తి కావొస్తుంది కానీ హామీలు మాత్రం పూర్తికాలేదు వెంటనే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్టుగా నిరుద్యోగ భృతి 4000 వేల హామీని అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరుపున ఉద్యమం చేపడతాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలాందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, భారతదేశం యొక్క భవిష్యత్తు యువత చేతిలో ఉందని, గొప్ప ప్రయోజకులై తల్లితండ్రులకు, జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. తమ ట్రస్ట్, బిజెపి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, యువతలో నిరుద్యోగత తగ్గించడం కోసం తన వంతుగా ఆరు నెలలకు ఒకసారి బిగ్ జాబ్ మేళా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మెన్ అంత రెడ్డి రాజా రెడ్డి, బీజేపీ నాయకులు శివునూరి భాస్కర్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.