కులోన్మాదానికి, మతోన్మాదానికి స్వస్తి పలకాల్సిందే

మాజీ SFI రాష్ట్ర నాయకులు బండారి రవి కుమార్

స్థానిక దమ్మపేట మండల కేంద్రంలో SFI డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు బండారు రవి కుమార్ కులోన్మాదానికి , మతోన్మాదానికి అతీతంగా సమానత్వ సమాజం కోసం కృషి చేయాలని బోధించారు. ఈ సందర్భంగా మనిషి కులం, మతం కంటే ముందు పుట్టాడని, కులాన్ని, మతాన్ని మనిషే సృష్టించ్చారని అన్నారు. కావున కులాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టకుండా విద్యార్థులందరూ ఐక్యంగా విద్యాసంస్థలలో సౌకర్యాలు, హక్కులు ప్రభుత్వాన్ని అడిగి పోరాడి సాదించుకోవాలన్నారు. భారతదేశం లౌకిక, సర్వసత్తాక, ప్రజాస్వామ్య, ఘనతంత్ర, సామ్యవాద దేశం అని అన్ని మతాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారని అన్నారు. ఏ మతము ప్రమాదంలో లేదని, మతం ప్రమాదంలో ఉందని దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ ప్రజల మధ్య ఐక్యత లేకుండా గొడవలు సృష్టిస్తున్నారన్నారు. దేశంలో అన్ని మతాలు సమానమని, ఒక మతం మరో మతం మీద విద్వేషాలు, చులకన భావం ఉండరాదని. హిందూ, ముస్లిం, క్రైస్తవులుతోపాటు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అన్ని మతాలు ప్రజలు దేశంలో సమానమైన అన్ని హక్కులు ఉన్నాయని అన్నారు. అన్ని మతాలు ప్రజలను గౌరవిస్తూ, కలిసి జీవించాలని అన్నారు. ఈ శిక్షణా తరగతులలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్, మండల నాయకులు నాగబాబు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.SFI జిల్లా కమిటీ  సభ్యులు రామ్ చరణ్

Join WhatsApp

Join Now