గీత కార్మికుల ఉపాధికై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

గీత కార్మికుల ఉపాధికై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

కెజికేఎస్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్ గౌడ్

ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 11, కామారెడ్డి :

రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వీరి ఉపాధి మెరుగుపడే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ వద్ద జరిగిన సంఘ సమావేశం సందర్భంగా మాట్లాడారు. వృత్తిలో ఉపాధి మెరుగు పడాలంటే ప్రధానంగా చెట్ల పెంపకానికి భూములివ్వాలని, కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, నీరావంటి తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి గీత కార్మికుడికి మోటార్ సైకిళ్ళు పంపిణీ చేయాలని, కల్లు గీత కార్మికుడు సహజ మరణం పొందితే గీత కార్మికునికి 5 లక్షల రూపాయలు ఇచ్చేలా గీతన్న బీమా పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి గీత కార్మికుని కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం ఇవ్వాలని అన్నారు. ప్రకృతి పానీయం స్వచ్ఛమైన కల్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైందని దీనిని ఆధునిక పద్ధతుల ద్వారా ప్రజలకు అందజేయాలని తద్వారా గీత కార్మికుల ఉపాధి మెరుగు పడుతుందని అన్నారు.
హైదరాబాదు నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ కు , వివిధ ప్రాంతాలకు సమృద్ధిగా నీరా ను బాటిలింగ్ చేసి పంపిణీ చేయవచ్చని తెలిపారు. బుట్టలు, బ్యాగులు, దండలు తదితర ఫ్యాన్సీ వస్తువులను తయారుచేసి మార్కెటింగ్ చేయవచ్చని ఫలితంగా గీత కార్మికులకి ఉపాధి కలుగుతుందని అన్నారు.
బిసి సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తక్షణమే జోక్యం చేసుకొని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు శేఖర్ గౌడ్ ,బాలా గౌడ్, గంగాధర్ గౌడ్, నర్సగౌడ్, బాలారాజ్ గౌడ్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now