జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్

 

పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 10వ జోనల్ స్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్ – 2024ను రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించగా వారితో పాటు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ముందుగా జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా జాతీయ జెండా, ఒలంపిక్స్, జోనల్ క్రీడా పథకాలను మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ లు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే జోనల్ స్థాయి క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చూపాలని, సంక్షేమ గురుకులాలు భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ గురుకులాలుగా మరింత నాణ్యమైన, విద్యార్థికి అవసరమైన నైపుణ్యాల్ని అందిస్తామన్నారు. గురుకులంలోని ప్రతి విద్యార్థి చదువుతో పాటు సర్వతో ముఖాభివృద్దికి అవసరమైన క్రీడలు, సాంస్కృతిక నైపుణ్యాల పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు మరియు తదితరులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now