మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని గ్రీవెన్స్ లో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయహస్తం ఏమైందని అది ఎలాగో ఇవ్వరు కానీ కనీసం గత ప్రభుత్వంలో దళిత బంధు ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు త్వరితగతిన దళిత బంధు ఇవ్వాలని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని దీని ద్వారా కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నుండి 600 మంది పరిహారం కొరకు వారి చెప్పులు అరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని వారికి త్వరితగతిన పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందు పెట్టి దళితులకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలాన్ని పక్కదారి పట్టిస్తూ దళితులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించడం జరిగింది. ఇకనైనా దళితులందరూ కళ్ళు తెరుసుకొని ప్రభుత్వం ద్వారా హక్కుగా మనం పొందవలసినటువంటి పథకాలపై దృష్టి సారించి వాటిని పొందే విధంగా దళితుల ప్రయత్నాలు ఉండాలే గాని ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మాల, మాదిగలు కొట్టుకునే విధంగా ఉండవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. కొత్తగూడెం నియోజకవర్గం లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని మున్సిపాలిటీ వారు నిర్లక్ష్యానికి గురిచేసి అంబేద్కర్ కమిటీ హాల్ శిధిలావస్థకు తీసుకొస్తున్నారని కొత్తగూడెం లోని అంబేద్కర్ కమిటీ హాల్ పై దృష్టి సారించి ఉపయోగంలోకి నిర్వహణలోకి తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు నవధన్, బడికల. పుష్కలత, గంధం, కల్పన, సురేష్ నరేష్ తదితర మాలమాల నాయకులు పాల్గొన్నారు.