మణిపుర్‌లో మళ్లీ హింస 11 మంది మిలిటెంట్లు హతం..
ఇంఫాల్ మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పుల్లో 11 మంది సాయుధులు మృతి చెందారు.స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.. వీరంతా కుకీ తిరుగుబాటు దారులుగా అనుమానిస్తున్నారు.
మణిపుర్ లోని జిరిబామ్ జిల్లా బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై సోమవారం మధ్యాహ్నం కొందరు సాయుధులు దాడులకు పాల్పడ్డారు. అనంతరం సమీపంలో ఉన్న జకురాడోర్ కరోంగ్ గ్రామం వైపు దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు-మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన లోనే 11 మంది మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అటు కొంతమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కూడా గాయాలైనట్లు సమాచారం..
ఇదిలా ఉంటే, బిష్ణుపుర్ జిల్లాలో ఇటీవల మిలిటెంట్ల దాడిలో ఓ మహిళ మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇంఫాల్ లోయ లోని సైటాన్ ప్రాంతంలో నవంబర్ 9న ఈ ఘటన చోటు చేసుకుంది. పొలంలో పని చేస్తున్న రైతులను లక్ష్యంగా చేసుకుని సాయుధులు జరిపిన కాల్పుల్లో మహిళ మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
మణిపుర్‌లో మళ్లీ హింస 11 మంది మిలిటెంట్లు హతం..
by kana bai
Published On: November 12, 2024 2:12 pm