సిద్దార్ధ పాఠశాల లో “స్పోర్ట్స్ మీట్”

స్థానిక భద్రాచలం సిద్దార్ధ స్కూల్ నందు బాలల దినోత్సవం ను పురస్కరించుకొని ఆటల పోటీలు

భద్రాచలంలో మూడు దశాబ్దాలుగా ఎంతో నైపుణ్యం గల విద్యార్థులను సమాజ సేవకు అందించిన ఘనత సిద్దార్ధకే చెల్లుతుంది

ఈ బాలల దినోత్సవ సందర్భం గా నిర్వహించ బోయే ఆటలపోటీ లను సాంస్కృతిక కార్యక్రమాలను ఆడుతూ పాడుతూ విద్యార్థులను ఉత్సాహాo తో పాల్గొనాలని. ఈ సందర్భం గా ఉపాద్యాయులు విద్యార్థులుకు సిద్దార్ధ స్కూల్ ప్రిన్సిపాల్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎంతో కోలాహలంగా పోటీలు ప్రారంభించారు.ఈ ఆటలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిద్దార్ధ ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ.చెస్,కారమ్స్ ఖో ఖో, కబడ్డి, టెన్ని కాయిట్,షటిల్ వంటి పోటీలు, చదువుతో పాటు విద్యార్ధుల్లో మానసిక ఉల్లాసం విద్యార్థికి విద్య పై చురుకైన విధానం పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి వివాదాలకు లోనవకుండా స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆటలో ఓటమి అయినా గెలుపైనా ఒకే విధంగా తీసుకోవాలని ఎటువంటి గాయాలకు లోనవకుండా ఉపాధ్యాయులు విద్యార్థులకు రక్షణగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిద్దార్ధ విద్యా సంస్థల ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now