ఇటీవలే విజయవాడలో ఎన్.ఎస్.ఎం.స్కూలులో జాతీయస్థాయిలో జరిగిన వివిధ రకాల క్రీడా పోటీలలో ఖమ్మం నుండి మౌంట్ ఫోర్ట్ హై స్కూల్ విద్యార్థిని , విద్యార్థులు పాల్గొనడం జరిగింది . వ్యక్తిగత పోటీలో డిస్కస్ త్రో విభాగంలో పదో తరగతి విద్యార్థి డి.ఉమా మహేష్ ప్రథమ స్థానములు నిలచి స్వర్ణ పథకాన్ని సాధించాడు . తదుపరి కోకో లో 12 మంది విద్యార్థులు టీమ్ గా ఏర్పడి తృతీయ స్థానాన్ని చేజిక్కించుకొని కప్పును పొందారు . ఈ క్రీడా పోటీలకు విజయవాడ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన వారికి పథకాలను అందజేశారు . ఖమ్మం మౌంట్ ఫోర్ట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రెవరెండ్ బ్రదర్ జాన్ పాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జోష్ పాల్గొని క్రీడాకారుల విజేతలను అభినందించారు . విద్యార్థులలో సోదర భావాన్ని పోటీ తత్వాన్ని జాతీయవాదాన్ని పెంపొందించడానికి మౌంట్ ఫోర్ట్ విద్యాసంస్థ తమ విద్యార్థులకు జాతీయస్థాయిలో ప్రతి రెండు సంవత్సరములకు పోటీలను నిర్వహిస్తామని తెలిపారు . ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు .
Latest News
