విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 15, కామారెడ్డి :
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన 300 సంవత్సరాలు కలిగిన అతి పురాతనమైన దేవాలయమైన విఠలేశ్వర దేవాలయాన్ని శుక్రవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబాతో పాటు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ మండల కురుమ సాయిబాబాకు శాలువాలతో సన్మానించి ఆహ్వానించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయం విఠలేశ్వర ఆలయం అని ఈ ఆలయానికి సుమారు 300 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నేతృత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి పదవి దక్కాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం మండల అధ్యక్షులు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.