ఈ నెల 17, 18 న గ్రూప్ – 3 పరీక్ష
–జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 16, కామారెడ్డి :
తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమీషన్ ఆది, సోమవారాల్లో నిర్వహించబోతున్న గ్రూప్ – 3 పరీక్షకు కామారెడ్డి పట్టణంలో 20 సెంటర్లలో 8268 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాను తెలిపారు. ఈ పరీక్షలు నిర్వహణకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నోడల్ అధికారిగా, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి పోలీస్ నోడల్ అధికారిగా, డా.కె.విజయ్ కుమార్ రీజనల్ కో ఆర్డినేటర్ గా, డా.వి.శంకరయ్య అసోసియేట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.
20 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది అబ్సర్వర్లు, ఒక స్పెషల్ అబ్సర్వర్, నలుగురు రూట్ ఆఫీసర్లు, 63 మంది బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లు, 360 మంది ఇన్విజిలేటర్లు, జిల్లా యంత్రాంగం నుంచి నలుగురు జాయింట్ రూట్ ఆఫీసర్లు, 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 93 మంది ఐడెంటిఫికేషన్ అధికారులు, 100 మందికి పైగా పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు.
గ్రూప్ 3 పరీక్షకు మూడు పేపర్లు ఉంటాయి.
*1 వ పేపర్ 17 నవంబర్ 2024 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గం ల వరకు.*
*2 వ పేపర్ 17 నవంబర్ 2024 న మధ్యాహ్నం 3:00 నుండి 5:30 గం ల వరకు*
*3 వ పేపర్ 18 నవంబర్ 2024 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గం ల వరకు* ఉంటుందని తెలిపారు.
– అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోనికి ఉదయం పరీక్షకు 8.30 కు మధ్యాహ్నం పరీక్షకు 1.30 కి అనుమతిస్తారు. కనుక అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని తెలిపారు.
– ఉదయం పరీక్షకు 9:30 కు మధ్యాహ్నం పరీక్షకు 2.30 కు పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేస్తారు. తర్వాత ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించరు.
*అభ్యర్థులకు సూచనలు*
అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్, బ్లాక్/ బ్లూ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి. ఏదేని ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్/ డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ కార్డు/ పాన్ కార్డ్/పాస్ పోర్ట్ etc.) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. హాల్ టికెట్ పై కలర్ ఫోటో అతికించుకోవాలి. ఒకే హాల్ టికెట్ ను మూడు పరీక్షలకు ఉపయోగించాలి.
పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు, క్యాలిక్యులేటర్లు, పర్సులు, ఇతర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులు చెప్పులు వేసుకొని రావాలి. బూట్లకు అనుమతి లేదు.
అభ్యర్థి వివరాలు ముద్రించబడిన OMR పత్రంపై నలుపు/ నీలం బాల్ పాయింట్ పెన్నుతో బబ్లింగ్ చేయాలి.
పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (వేలి ముద్రలు), ఫోటో తీసుకోవడం ద్వారా హాజరు నమోదు చేస్తారు. చేతి వేళ్ళకు మెహెందీ, టాటూలు పెట్టుకోవద్దు. చేతికి అవి ఉంటే బయోమెట్రిక్ పరికరం హాజరు గుర్తించదు.
– పరీక్ష వేళలో ప్రతీ అరగంటకొకసారి “బెల్” కొట్టిస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు వరకు ఎవరినీ బయటకు వదలరు. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ ప్రశ్నాపత్రాలను వెంట తీసుకెళ్లాలి.