*జర్నలిస్ట్ అంటే…….?

*జర్నలిస్ట్ అంటే…….?

 

 

*జర్నలిస్ట్ అంటే?*

*అక్రిడేషన్ కాదు….*

*అనువాదకుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*ప్రభుతకు – ప్రజలకు మధ్య…*

*నిజాల చేరవేతల సంధానకర్త.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*నిజాలను నిర్భయంగా…*

*రాసే సత్తా ఉన్నవాడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*ఆస్థాన కవి కాదు….*

*ఆభిదానకుంకుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*నీలివార్త కాదు….*

*నిజాల నిగ్గు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*పొగడ్తల పన్నీరు కాదు….*

*జనపద భాసితుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*జపించువాడు కాదు…*

*జనహితుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*కీలుబొమ్మ కాదు…*

*సమాజ మార్గదర్శి.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*కాందిశీకుడు కాదు…*

*కాలాన్ని కదిలించే,కలంయోధుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*నిష్ప్రయోజకుడు కాదు…*

*నిష్ణాతుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*స్థాణువుడు కాదు…*

*స్వాప్నికుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*నిద్రాణుడు కాదు…*

*మేల్కొలిపే ఉదయ భానుడు.*

 

*జర్నలిస్ట్ అంటే?*

*నిరంతర శ్రామికుడు…*

*ప్రజల ప్రేమికుడు*

 

*✒✒..

Join WhatsApp

Join Now