*మణిపూర్ లో మళ్లీ మంటలు…?
హైదరాబాద్:నవంబర్ 17
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి అట్టుడుకుతుంది మణిపూర్ లో హింస మళ్ళీ చెలరేగింది. ఇంఫాల్ లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు, దాడి చేశారు.
ఇళ్లకు నిప్పు పెట్టారు. దాడుల నేపథ్యంలో ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్ లోని పలు చోట్ల ఇంటర్నేట్ సేవలను నిలిపివేసింది. జిరిబామ్ జిల్లాలో అనుమా నాస్పదంగా మరణించిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకారులు నిరసనలకు దిగారు.
24గంటల్లో హంతకులను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రత దళాలు ఆందోళన కారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.