ఢిల్లీ రవాణా శాఖ మంత్రి రాజీనామా…?

ఢిల్లీ
Headlines in Telugu
  1. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలతో కైలాష్ గహ్లోత్ రాజీనామా
  2. యమునా శుభ్రత హామీ విఫలం: ఢిల్లీ మంత్రి ఆప్‌కు గుడ్‌బై
  3. ఆప్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గహ్లోత్ రాజీనామా
  4. రాజకీయాల నుండి తప్పుకోవడానికి ఆప్ రాజధాని మంత్రికి మార్గం లేదు
  5. కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం: కైలాష్ గహ్లోత్ లేఖలో కీలక వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ:నవంబర్ 17

దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ కు లేఖ పంపారు. దిల్లీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని.. రాష్ట్రంలో పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోం దని కైలాష్ గహ్లోత్‌ ఈ లేఖలో ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తన రాజీనామాలో… యమునాను శుభ్రపర చడం, కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని, అయితే యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని గెహ్లాట్ పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటంలో ఎక్కువ సమయం గడిపితే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైంది. ఆప్ నుంచి విడిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.” అని కైలాష్ గెహ్లాట్ లేఖలో రాసుకొచ్చారు. 

కేజ్రీవాల్‌కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. మంచి రాజకీయ ప్రయాణానికి తోడ్పాటును అందించిన తన పార్టీ సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. కైలాష్ గెహ్లాట్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.

Join WhatsApp

Join Now