Headlines in Telugu
-
ఈ నెల 29న విశాఖలో మోదీ శంకుస్థాపనలు
-
పూడిమడక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన
-
విశాఖ రైల్వేజోన్‌ను ప్రారంభించే మోదీ
-
ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో బహిరంగ సభకు ప్రధాని మోదీ
-
ఏపీ అభివృద్ధికి మోదీ పర్యటన కీలకమంటున్న విశ్లేషకులు
నవంబర్ 17
ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీ లోపర్యటించనున్నా రు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారని సమాచారం. అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని తెలుస్తోంది.
దాని నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఏయూ మైదానాన్ని పరిశీలించారు. ఇదే పర్యటనలో విశాఖ రైల్వేజోన్‌తో పాటు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిసింది.