మామునూరు ఎయిర్ పోర్టును పట్టుబట్టి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి

సీఎం
Headlines in English
  1. Minister Konda Surekha Thanks CM Revanth Reddy for Malkunuru Airport Project
  2. Minister Konda Surekha Lauds CM Revanth Reddy for Achieving Warangal’s Long-Awaited Airport
  3. Konda Surekha Expresses Gratitude to CM Revanth Reddy for Kakatiya Mega Textile Park Flood Relief
  4. Warangal’s Dream of Malkunuru Airport Becomes a Reality with CM Revanth Reddy’s Efforts
  5. Congress Government’s Commitment to Public Welfare Highlighted by Minister Konda Surekha

తన రాజకీయ ప్రస్థానంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందన్న మంత్రి* 

వరంగల్ ప్రజల దశాబ్దాల నాటి చిరకాల వాంఛ నెరవేరిందన్న మంత్రి సురేఖ*

*వరంగల్ బిడ్డగా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని తెలిపిన మంత్రి*

*మామునూరు ఎయిర్ పోర్టును పట్టుబట్టి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి*

*కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు వరద ముంపు నివారణ పనుల నిమిత్తం మరో 160.92 కోట్లు విడుదల చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న మంత్రి సురేఖ*

*గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూ నిర్వాసితులకు 863 ఇండ్లను మంజూరు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి*

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో సహకరిస్తున్నారన్న మంత్రి*

తన ప్రతిపాదనలను పెద్ద మనసుతో ఆమోదించి, రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతున్న సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సురేఖ*

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తూనే వుంటారన్న మంత్రి*

*ప్రజల ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మంత్రి*

మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు హర్షం వ్యక్తం చేశారు. మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటు తన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. వరంగల్ బిడ్డనైన తాను మంత్రిగా వున్న సమయంలో వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టుకు మోక్షం లభించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తున్నదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. మామూనూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టువదలకుండా శ్రమించి అనుకున్నది సాధించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. 

దీంతో పాటు వర్షాకాలంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు పొంచి వున్న ముంపును నివారించేందుకు గాను అవసరమైన పనులు చేపట్టే నిమిత్తం రూ. 160.92 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేయడం పట్ల మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డిగారికి ధన్యావాదాలు తెలిపారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు నిమిత్తం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 863 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల తన నిబద్ధతన మరోసారి చాటుకున్నదని మంత్రి అన్నారు. సంవత్సరాలుగా పెండింగ్ లో వున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూ నిర్వాసితుల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే పరిష్కరించి చేతల ప్రభుత్వంగా నిరూపించున్నదని మంత్రి సురేఖ పేర్కొన్నారు.                                                                    ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనులకు ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణనను అమలు చేయబోతున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment