పెద్ద దర్గాలో గంధాన్ని సమర్పించిన పీఠాధిపతి

పీఠాధిపతి
Headlines in Telugu:
  1. పెద్ద దర్గాలో గంధ మహోత్సవం ఘనంగా నిర్వహణ
  2. పీఠాధిపతి గంధాన్ని సమర్పించి ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు
  3. ఏఆర్ రెహమాన్ పెద్ద దర్గాలో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు
  4. కడపలో అమీన్‌పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా
  5. ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు అక్రమ్ అస్లం
*పెద్ద దర్గాలో గంధాన్ని సమర్పించిన పీఠాధిపతి*

గంద మహోత్సవంలో పాల్గొన్న మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ భాష, సంగీత ప్రముఖులు ఏఆర్ రెహమాన్….

కడప, దేశంలోనే ప్రసిద్ధ సూఫీ

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన కడప , అమీన్‌పీర్‌ పెద్దుదర్గాలో వెలసిన హజరత్‌ సూఫీ సరమస్త్‌సాని చల్లాకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్‌ మహమ్మదుల్‌ హుసేనీ చిస్టివుల్‌ ఖాద్రి ఉరుసు ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవం శనివారం పెద్ద దర్గాలో సూఫీ సర్ మస్త్ సాని చిల్లా కష్ ఆరిఫుల్లా మహమ్మద్ మొహమ్మద్ మొహమ్మద్ ఉల్ చిష్తి ఉల్ ఖాదరి వారి గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉరుసు లో భాగంగా మొదటగా సాయంత్రం ఐదు గంటలకు అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు పీఠాధిపతి గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మలంగ్ షా ను ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పీరీ పీఠంపై కూర్చో పెట్టారు. రాత్రి 9:30 గంటలకు గంధ మహోత్సవం ప్రారంభమైంది. పీఠాధిపతి స్వగృహం నుండి గంధకలశం తీసుకొని వచ్చి స్వామివారి మజార్ మీద సమర్పించి ఫతేహా సమర్పించారు. రాత్రి 11 గంటలకు ప్రముఖ ఖవ్వల్ అక్రమ్ అస్లం చే గొప్ప ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రముఖ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ పెద్ద దర్గా ఉరుసు గంధ మహోత్సవంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now