ఆదివాసిల కనీస మౌలిక వసతులు కల్పించండి సార్

 

తెలంగాణ_రాష్ట్ర_గవర్నర్ కి సవినయంగా నమస్కరించి వ్రాయునది
తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది పూర్తిగా విద్య వైద్యం సదుపాయం అందుబాటులో లేక ఎంతోమంది ఆదివాసులు నిరాశ్రయులు అవుతున్నారు.
1, #విద్యా_వైద్యం
2, #రహదారి_సదుపాయాలు
3, #పోడు_భూముల_సమస్య
4, #కొమరం_భీమ్_పెద్ద_విగ్రహం
#కొమరం_భీమ్_మ్యూజియం మరియు #గ్రంథాలయం #IAS_IPS చదువుల కోసం జిల్లా కేంద్రాలలో #స్టడీ_సెంటర్స్ ఏర్పాటు చేయాలని మనవి
ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా విద్యా వైద్యం అందుబాటులో లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు
చదువుకునే ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని పరిస్థితిలో చదువు నిష్పత్తి పడిపోతున్నది
వైద్యం అందని పరిస్థితిలో గర్భిణీ స్త్రీలకు కూడా ఎటువంటి రహదారి సౌకర్యం లేక చప్ట లలో తీసుకొని కాడే కట్టుకొని పోతున్నారు సరైన అంబులెన్స్ సదుపాయాలు కూడా అందుబాటులో లేవు
వర్షాకాలంలో సరైన బ్రిడ్జి మార్గంలేక రాకపోకలు కూడా ఇబ్బందికి గురవుతున్నారు.
మరి ముఖ్యంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములు 2005కి ముందు సాగు చేసుకుంటున్న పోడు భూములను కూడా ఫారెస్ట్ అధికారులు లాక్కొని ట్రైన్చ్ కొట్టి ఆదివాసులకు భూములు మీద హక్కు లేకుండా చేస్తున్నారు కావున పోడు మీద ఆధారపడిన ఆదివాసులకి మనిషికి 5 ఎకరాలు ఏర్పాటు చేసేలా ఫారెస్ట్ అధికారులకు కోరుతున్నాను
1, ఆదివాసిలకి ముఖ్యంగా విద్యా వైద్యం అందుబాటులోకి తేవలసిందిగా కోరుకుంటున్నాను
2, చదువుకోలేని ఆర్థిక సోమత లేని ఆదివాసులకు ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను
3, ముఖ్యంగా పొడభూముల సమస్యను పరిష్కరించి ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను
4, ఖమ్మం జిల్లా విశిష్టత దాని యొక్క నైసర్గీక స్వరూపాన్ని బట్టి అక్కడ ఆదివాసుల ప్రాంతం ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడ ట్రైబల్ మ్యూజియం
కొమరం భీం గారి పెద్ద విగ్రహం అలాగే ఆదివాసుల పురాతన చరిత్ర కు సంబంధించి మరియు విద్యార్థులకు అందుబాటులో అన్ని సదుపాయాలు కలిగిన జిల్లా గ్రంధాలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తమరిని వేడుకుంటున్నాను.తమ విధేయుడు
పెండేకట్ల యాకయ్య దొర
ఆదివాసి జెఏసి జిల్లా నాయకులు
ఇల్లందు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Join WhatsApp

Join Now

Leave a Comment