కేటీఆర్ చిల్లరగా మాట్లాడడం మానుకోవాలి

కేటీఆర్
Headlines:
  1. “కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలపై మండ అశోక్ గౌడ్ విమర్శలు”
  2. “తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం: కాంగ్రెస్ vs బీఆర్‌ఎస్”
  3. “రాష్ట్ర మంత్రులను అవమానిస్తే తగిన గుణపాఠం చెప్తామన్న కాంగ్రెస్ నేత”
  4. “కేటీఆర్, హరీష్ రావుపై మండ అశోక్ గౌడ్ తీవ్ర ఆరోపణలు”
  5. “రాజకీయ వివాదం: కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం”
*జమ్మికుంట నవంబర్ 18 ప్రశ్న ఆయుధం*

రాష్ట్ర మంత్రివర్గంలోని 12 మంత్రుల పై కేటీఆర్ చిల్లరగా మాట్లాడడం మానుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మండ అశోక్ గౌడ్ అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో సోమవారం రోజున మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గంపై అహంకారపూరితంగా మాట్లాడడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ ఒక చిల్లర వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత లకు రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని హరీష్ రావు భూములతో పాటు పాల వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు మాజీ ఎంపీ కవిత లిక్కర్ వ్యాపారంలో కోట్లు గడించారని ఎద్దేవా చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక సైకోగా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అన్ని హామీలు నెరవేర్చారని మిగిలిన ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకాన్ని అమలుచేసి చూపిస్తారన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా రంజక పాలనను చూసి అధికారం లేక కేటీఆర్ హరీష్ రావు పిచ్చి ఎక్కి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు ఏడాది కావస్తున్నా కేసిఆర్ పత్తా లేకుండా పోయిండని రాష్ట్ర మంత్రులను కేటీఆర్ బేకార్ గాళ్ళు అంటే ఖబర్దార్ అని మాట్లాడే పద్ధతి, భాష మార్చుకోనట్లయితే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు అవినీతిపరులైన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించి పథకాలను అమలు చేస్తున్నారని సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నాయకులు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే టిపిసిసి కి ఫిర్యాదు చేయాలని సూచించారు మూసీ నదిని రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షళన చేస్తే తప్పేంటని పేర్కొన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now