సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన విజయవంతం చేయండి

సీఎం
Headlines in Telugu:
  1. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన: 130 కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మంజూరు!
  2. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన
  3. రాజన్న ఆలయ అభివృద్ధికి 50 కోట్లు బడ్జెట్‌లో, మరో 130 కోట్లు మంజూరు!
  4. వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలతో విజయవంతం చేయాలని రాజెండర్ రావు పిలుపు
  5. నెమ్మదిగా అభివృద్ధి పథంలో: సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు

 *రాజన్న ఆలయ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి..* 

 *పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం* 

 *కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు* 

*కరీంనగర్ నవంబర్ 19 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీ బుధవారం వేములవాడలో  పర్యటించనున్నారని ఈ పర్యటనను ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం వెలిచాల రాజేందర్ రావు వేములవాడలో పర్యటించారు సీఎం పర్యటన విజయవంతం చేయడంపై నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు ప్రారంభించే ప్రాంతాలను పరిశీలించారు అనంతరం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి ఉమ్మడి జిల్లాలోని వేములవాడలో పర్యటిస్తున్నారని తెలిపారు పలు అభివృద్ది కార్యక్రమాలు, శంఖుస్థాపనలు చేస్తారని దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ది, విస్తరణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. 2023-24 బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. తాజాగా వేములవాడ ఆలయాభివృద్ధి కోసం 130 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో ఏటా 100 కోట్లు కేటాయిస్తామని మోసం చేసి రంగు రంగుల బ్రోచర్లతో కాలం వెల్లదీ శారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణకు శంఖుస్థాపన చేస్తారని, రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధి సమాంతరంగా ఉంటుందన్నారు. నేతన్నల 30 సంవత్సరాల చిరకాల కోరిక అయిన యారన్ డిపో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనికి సోమవారం 50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు గత ప్రభుత్వం నెంబర్ 2గా ఉన్న యువరాజు కూడా యారన్ డిపో తేలేక పోయాడని, యారన్ డిపో ఏర్పాటు చేస్తే కొందరు బిఆర్ఎన్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ గా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఒక్క నయా పైసా రాజన్న ఆలయానికి ప్రసాద్ స్కీము ద్వారా తీసుకు రాలేకపోయారని ఆరోపించారు. నేతన్నల మెగా కస్టర్ ను వరంగల్ తరలి పోయేలా చేశారని మండిపడ్డారు స్కీం ఉన్నప్పుడు కూడా యార్న్ డిపో కూడా తేలేదని పేర్కొన్నారు. నేతన్నల చావులకు కారణమైన బీఆర్ఎస్, బిజెపి చెయ్యని పనులను సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిలు 200 కోట్లు పెద్ద మనసుతో విడుదల చేశారని చెప్పారు. అలాంటి మనసున్న మారాజు మన వేములవాడకు వస్తున్నందుకు మనందరం మూకుమ్మడిగా స్వాగతం పలకడం ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. నిండు మనసుతో ఆశేష జనావళితో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ఘనంగా స్వాగతం పలుకుదామని వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. 2018లో ముంపు గ్రామాల ప్రజలకు ఆశల పల్లకీలో కేసిఆర్ ఆనాడు డబుల్ బెడ్ రూం కింద ఇండ్లు ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు 4400 ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇందుకు దాదాపు 220 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని రాజేందర్ రావు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment