జిల్లా రోడ్లపైనా టోల్‌

జిల్లా
Headlines in Telugu:
  1. జిల్లా రోడ్లపైనా టోల్‌గేట్లు: చంద్రబాబు కీలక ప్రకటన
  2. శాసనసభలో చంద్రబాబు టోల్‌గేట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
  3. చంద్రబాబు నాయుడి రాష్ట్ర రోడ్లపై టోల్‌గేట్లు: కొత్త ఆలోచన
  4. జిల్లాల మధ్య టోల్‌గేట్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావన
  5. టోల్‌గేట్లతో రోడ్ల నిర్వహణ మెరుగుపరచాలని చంద్రబాబు

వ్యతిరేకిస్తే గుంతలే గతి 

శాసనసభలో చంద్రబాబు ‘జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర, జిల్లా స్థాయిలోని అన్ని ప్రధాన రోడ్లపై టోల్‌గేట్లు ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నాం. రోడ్ల నిర్వహణను అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగిస్తాం. వారు టోల్‌ ఫీజు వసూలు చేసుకుంటారు. దీనికి ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ఎంఎల్ఏలదే. ఎక్కడైనా వ్యతిరేకిస్తే అక్కడ గుంతల రోడ్లతోనే ఉండాలి.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం సాయంత్రం శాసనసభలో రహదారుల అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రోడ్లపైన పైలట్‌ ప్రాజెక్టుగా టోల్‌గేట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

‘ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. కానీ, ఆలోచనలు ఉన్నాయి’ అని అన్నారు. ‘ జనవరిలో పండగ సందర్భంగా ఎవరైనా రాష్ట్రానికి వస్తే మెరుగైన రోడ్లు కనిపించాలన్న ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నాం.’ అని ఆయన అన్నారు. ఈమేరకు మీలో ఆసక్తి ఉన్న వారు చేతులు ఎత్తాలని చంద్రబాబు కోరగా పలువురు ఎంఎల్ఏలు చేతు లెత్తారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర,జాతీయ రహదారులకు వెళ్లే మార్గాల్లో టోల్‌గేట్లు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు సిఎం తెలిపారు. గత ప్రభుత్వం అన్ని రహదారులను విచ్చిన్నం చేసిందని, పెద్ద ఎత్తున గుంతలు పడినా పట్టించుకోలేదన్నారు. నిధుల కొరత కారణంగా గ్రామీణ రహదారులు కాకుండా పట్టణాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు టోల్‌ గేట్లు పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఆటోలు,ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఇస్తూ మిగతా నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహన దారుల వద్ద టోల్‌ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నామని వివరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తానే పిపిపి పద్ధతిలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రతిపాదన చేశానని అప్పట్లో తనను అందరూ వ్యతిరేకించారని, కానీఇప్పుడు దేశ వ్యాప్తంగా నాలుగు, ఆరు, ఎనిమిది, 14 లైన్ల జాతీయ రహదారులు కూడా వచ్చాయని, అన్నింటికి టోల్‌గేట్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి అభివృద్ధి చెందిన తరువాత తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం వెళ్తున్నారని తెలిపారు. ‘ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుంది.’ అని బాబు అన్నారు.

Join WhatsApp

Join Now