మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా!

మహారాష్ట్ర
Headlines in Telugu
  1. మహారాష్ట్రలో మహాయుతికి పట్టం: ఎగ్జిట్ పోల్స్ అంచనా
  2. ఝార్ఖండ్‌లో కాషాయ పార్టీకి ఓటర్ల మొగ్గు
  3. ఎంవీఏ కంటే మహాయుతి హవా పైచేయి
  4. ఎన్డీయే విజయ దిశగా: పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్ సర్వేలు
  5. INDIA కూటమి ప్రయత్నాలు తక్కువ: ఝార్ఖండ్ సర్వేలో స్పష్టం

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే(NDA), విపక్ష ఇండి కూటమి (INDIA) పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి..

తాజాగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో మహారాష్ట్ర ఓటర్లు శివసేన, భాజపా నేతృత్వంలోని మహాయుతికి మరోసారి పట్టం కట్టినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అటు ఝార్ఖండ్‌లోనూ కాషాయ పార్టీ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి.

మహారాష్ట్ర

పీపుల్స్‌ పల్స్‌: మహాయుతి-182, ఎంవీఏ-97, ఇతరులకు 9 స్థానాలు

సీఎన్‌ఎన్‌-న్యూస్‌18: మహాయుతి-154, ఎంవీఏ-128, ఇతరులు 6

మాట్రిజ్‌: మహాయుతి- 150-170, ఎంవీఏ- 110-130, ఇతరులు 8-10

పీ-మార్క్‌: మహాయుతి- 137-157, ఎంవీఏ- 126-146, ఇతరులు 2-8

లోక్‌శాహీ మరాఠీ: మహాయుతి- 128-142, ఎంవీఏ- 125-140, ఇతరులు 18-23

ఝార్ఖండ్‌

పీపుల్స్‌ పల్స్‌: ఎన్డీయే 46-58, ఇండియా కూటమి 24-37, ఇతరులు 6-10

మాట్రిజ్‌: ఎన్డీయే 42-47, ఇండియా కూటమి 25-30, ఇతరులు 1-4

టైమ్స్‌ నౌ-జేవీసీ: ఎన్డీయే 40-44, ఇండియా కూటమి 20-40, ఇతరులు 1-1

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా.. మెజార్టీ మార్కు 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని భాజపా 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష ఎంవీఏలోని కాంగ్రెస్‌ 101, శివసేన (Uddhav) 95, ఎన్సీపీ (SP) 86 సీట్లలో పోటీ చేయగా.. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి.

ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా మెజార్టీ మార్కు 41. భాజపా 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్‌విలాస్‌) పార్టీ ఒకచోట పోటీ చేశాయి. విపక్ష కూటమి తరఫున జేఎంఎం 43, కాంగ్రెస్‌ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్‌) నాలుగు చోట్ల పోటీ చేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment