Headlines in Telugu
-
రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా వైపి రమేష్ నియామకం, ముఖ్యమంత్రి చంద్రబాబు, MLA అమిలినేని సురేంద్ర బాబుకు కృతజ్ఞతలు
-
వైపి రమేష్ పదవి బాధ్యతతో ఏపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు
-
వైసీపీ పాలనలో అవినీతి విమర్శిస్తూ వైపి రమేష్ టీడీపీ పాలనను ప్రశంసించారు
-
వైపి రమేష్ నియామకంపై అభినందన సభ, భారీ కేక్ కట్ చేసి అభిమానులు ప్రదర్శన
-
రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి పొందిన వైపి రమేష్: పార్టీ నాయకుల అభినందన
*వైసీపీ ప్రభుత్వంలో పైసా లేనిదే పదవులు, ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ విమర్శ.* ..* .
*అవినీతి రహిత పాలన అందిస్తున్న MLA అమిలినేని సురేంద్ర బాబు అంటూ ప్రశాంశించిన వైపి రమేష్* …*
సీఎం చంద్రబాబు బాబుకు, MLA అమిలినేని సురేంద్ర బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపి రమేష్ .* ..
నాపై నమ్మకం తో రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ పదవి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తా అని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపి రమేష్ అన్నారు. బుధవారం ప్రజా వేదిక వద్ద మీడియా సమావేశం నిర్వహించాలని భావించగా నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాల్మీకులు, అభిమానులు తరలి రావడంతో అభినందన సభ గా మారిపోయింది. పార్టీ కష్టకాలం సేవాలాందించిన వైపి రమేష్ కి రాష్ట్ర స్థాయి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపి రమేష్ మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం లో ఉద్యోగాలు కావాలంటే లక్షలు తీసుకొని ఇచ్చారని, పదవులు కావాలన్నా డబ్బులు ఇవ్వల్సిందే అని డిమాండ్ చేసి అప్పటి ఉషశ్రీ చరణ్ తీసుకున్నారని విమర్శించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక MLA అమిలినేని సురేంద్ర బాబు అవినీతి రహిత పాలన చేస్తున్నారని ప్రసంశించారు. ఎవరితో కూడా చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా పదవులు ఇచ్చిన MLA అమిలినేని సురేంద్ర బాబు అని కొనియాడారు.
*అనంతరం పలవురు పార్టీ నాయకులు,వాల్మీకులు మాట్లాడుతూ.* … పార్టీ కోసం ఎంతో కృషి చేశారన్నారు. కష్టకాలంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. వార్డు సభ్యులు నుండి కళ్యాణి కో ఆపరేటివ్ డైరెక్టర్ గా అనేక సేవలందించరన్నారు. అంతే కాకుండా మున్సిపల్ చైర్మన్ గా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి తన అభివృద్ధి మార్క్ ఏంటో చూపించారని తెలియజేశారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులుగా పార్టీకి సేవలందించారని అన్నారు.
*భారీ కేక్ కట్ చేసిన అభిమానులు, మహిళలు .* ..
రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ పదవి రావడం తో సీఎం చంద్రబాబు బాబు కి, MLA అమిలినేని సురేంద్ర బాబు కి కృతజ్ఞతలు తెలుపుతూ…. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపి రమేష్ అభిమానులు, మహిళలు భారీ కేక్ ను కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ… భవిష్యత్ లో మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి సీనియర్ నాయకులు బిక్కి గోవిందప్ప,గోళ్ళ రమేష్, బీజేపీ యువ నాయకుడు తలారి సోము, జనసేన ఇంచార్జ్ రాజేష్,మాజీ వైస్ ఎంపిపి కంబదూరు ఎర్రిస్వామి,పట్టణ కన్వీనర్ శర్మస్ వలి, కుందుర్పి మండల కన్వీనర్ ధనుంజయ, ఎంపిటిసి లింగన్న,తలారి సత్తి, డీలర్ రామాంజినేయులు, మైనార్టీ నాయకుడు శామీర్, ఆకుల రెహమాన్, ఎర్రగుడి వెంకటేశులు, ఎం. కిష్టప్ప,బ్రహ్మాసముద్రం లింగన్న, కుమార్, పాలయ్య, మాజీ సర్పంచ్ చెన్నరాయుడు,గంగాధర్, రంగప్ప,మాజీ కౌన్సిలర్ లు, మాజీ ఎంపిపి లు, మాజీ ఎంపిటిసి లు, మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.