ఎక్కడికక్కడ మాఫియాముఠాలు..?

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. సీఎం చంద్రబాబు ఆరోపణలు, విమర్శలపై సుదీర్ఘంగా మాట్లాడిన  వైయస్‌ జగన్‌.

 వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌. ముఖ్యాంశాలు:

అప్పులపై అదే దుష్ప్రచారం:

– బడ్జెట్‌ పేజీ నెం.14. 16 రెండు పేజీలు చూస్తే.. రాష్ట్ర అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు అని చూపారు. దానికి గవర్నమెంట్‌ గ్యారెంటీ రూ.55 వేల కోట్లు కూడా కలిపితే అప్పటికి రాష్ట్ర అప్పు మొత్తం రూ.3.13 లక్షల కోట్లు.

– అలాగే 2024లో వైయస్సార్‌సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను అదే పేజీలో చూపారు. అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాయాయని, గవర్నమెంట్‌ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు, రెండూ కలిపితే మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు అని తేల్చారు.

– అది బడ్జెట్‌లోనే కాకుండా, 2023–24లో కాగ్‌ రిపోర్ట్‌ (పేజీ నెం.18. 20)లో చూపారు.

– అందుకే మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. అయ్యా, అబద్ధాల చెప్పడం ధర్మమేనా? రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు.. చివరకు ఎన్నికల నాటికి రూ.14 లక్షల కోట్లు అని చెప్పడం ధర్మమేనా? చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే దుష్ప్రచారం చేస్తూ. ఒక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరం) చేశారు.

అది తప్పైతే అసెంబ్లీలో ఎందుకు పెట్టారు?:

– చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకుని, ప్రజలకు చెప్పాలి.

అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అధికార యంత్రాంగమంతా ఆయన చేతుల్లోనే ఉంది. తన చేతుల్లో ఉన్న అధికారులతోనే బడ్జెట్‌ తయారు చేయించి, సభలో ప్రవేశపెట్టారు. అందులోని అధికారిక లెక్కలను కాగ్‌ కూడా ధృవీకరించింది.

– ఆ తర్వాత కూడా నీ హయాంలో, నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన నీ బడ్జెట్, నీ లెక్కలను కాగ్‌ ధృవీకరించిన తర్వాత, సభలో పెట్టిన తర్వాత కూడా.. ఈ అప్పుల గురించి, మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే.. ఇక అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?.

– చెప్పే అబద్ధాలకు ఒకటే బొంకు. అందుకే బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు?

మీరు రూ.42 వేల కోట్లు ఎగ్గొట్టి పోయారు:

– స్పిల్‌ ఓవర్‌ అక్కౌంట్స్‌ మీద కూడా అదే దుష్ప్రచారం. అవి ఏటా ఉంటాయి. ప్రతి బడ్జెట్‌ నుంచి, మరో బడ్జెట్‌కు స్పిల్‌ ఓవర్‌ బిల్స్‌ ఉంటాయి. అలా 2019లో చంద్రబాబు దిగిపోతూ మాకు పెట్టిపోయిన బిల్లులు ఏకంగా రూ.42,183 కోట్లు.

– బహుషా ఏ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో గిఫ్ట్‌లు ఇవ్వదు. అయినా మేము చిరునవ్వుతో చెల్లించాం.

బాబు హయాంలో పరిమితికి మించి అప్పు:

– 2014–19 మధ్య ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. అది కాగ్‌ నివేదికలోనే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలో కూడా ఉంది. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది.

– ఆ విధంగా చూస్తే.. మా హయాంలో చేసిన ఎక్కువ అప్పు కేవలం రూ.1647 కోట్లు మాత్రమే. మరి ఎవరు ఆర్థిక వి«ధ్వంసకారుడు. ఎవరు క్రమశిక్షణతో నడిచారు అన్నది ఈ డేటా చూస్తే అర్థమవుతుంది.

ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:

– చంద్రబాబు హయాంలో కోవిడ్‌ వంటి మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు ఆ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా చూస్తే.. – చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2019 నాటికి అది రూ.3.13 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పులు ఏటా సగటున 19.54 శాతం పెరిగాయి.

– అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లు కాగా, ఆ పెరుగుదల (సీఏజీఆర్‌) 15.61 శాతం మాత్రమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలో 4 శాతం తక్కువ.

– అలాగే నాన్‌ గ్యారెంటీ అప్పులు కలిపి చూసినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8600 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.77వేల కోట్లకు చేరాయి.

– అదే మా హయాంలో ఆ అప్పులను రూ.2 వేల కోట్లు తగ్గించాం. అంటే మేము దిగిపోయేనాటికి నాన్‌ గ్యారెంటీ అప్పులు రూ.75వేల కోట్లు.

– ఆ మేరకు చంద్రబాబు హయాంలో నాన్‌ గ్యారెంటీ అప్పులు 54.98 శాతం పెరిగితే, మా హయాంలో అది –0.48 శాతం.

వృద్ధిరేటుపై అసెంబ్లీ చంద్రబాబు:

– తన హయాంలో 2014–19 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 13.5 శాతం ఉంటే, అది 2019–24 మధ్య మా హయాంలో 10.6 శాతానికి పడిపోయిందని చెప్పారు.

– అయ్యా, చంద్రబాబు నీ హయాంలో కోవిడ్‌ లేదు. ఆ టైమ్‌లో దేశ వృద్ధి రేట్‌ చూస్తే.. కోవిడ్‌ వల్ల, దానికి ముందు 5 ఏళ్లతో పోల్చి చూస్తే.. అన్ని రాష్ట్రాల్లో అది తగ్గింది. అలాగే దేశంలో కూడా చూస్తే.. 10.97 శాతం నుంచి 9.82 శాతానికి వృద్ధిరేటు తగ్గింది.

ఇతర రంగాల్లో గణనీయ పురోగతి:

– 2019–24 మధ్య వృద్ధి రేటు మందగించినా.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తే..

2014–19 మధ్య చంద్రబాబు హయాంలో అది సగటున 11.92 శాతం ఉంటే, 2019–24 మధ్య అది 12.61 శాతం నమోదైంది.

అది సోషియో ఎకనామిక్స్‌ రిపోర్ట్‌లోనే ఇది స్పష్టంగా ఉంది.

– 2018–19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో జీవీఏ 1,88,601 కోట్లు అయితే, 2023–24 లో అది రూ.3,41,485 కోట్లు.

– అలాగే పారిశ్రామిక ఉత్పత్తి విలువలో 2014–19 మధ్య దేశంలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, మన హయాంలో 2023–24 నాటికి 8వ స్థానానికి వచ్చాం.

– అదే సమయంలో జీవీఏ పోల్చి చూస్తే, ఏపీ ఉత్పత్తి విలువ 12.6 శాతం ఉంటే, దేశ సగటు అది 8.17 శాతమే. అంటే 4 శాతం ఎక్కువ.

 

ఉద్యోగావకాశాలు. తలసరి ఆదాయాల పోలిక:

– ఎంఎస్‌ఎంఈ సెక్టర్‌లో చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కేవలం 8,67,537 ఉద్యోగావకాశాలు వస్తే.. 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగావకాశాలు వచ్చాయి.

– అలాగే భారీ, అతిభారీ పరిశ్రమల రంగం ద్వారా మా హయాంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది.

–ఇక రాష్ట్ర తలసరి ఆదాయం. చంద్రబాబు హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.154,031 కాగా, మా హయాంలో అది రూ.2,42,470.

– చంద్రబాబు హయాంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే, మా హయాంలో 15వ స్థానానికి ఎదిగింది.

– వాస్తవాలు ఇలా ఉంటే, తన హయాంలో కంటే, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీ పడిపోయిందని మాత్రమే చెబుతాడు. మిగిలిన అన్ని రంగాలు చాలా బాగున్నాయని చెప్పడు. తన హయాంలో కోవిడ్‌ లేదని చెప్పడు. పెరిగిన ఉద్యోగావకాశాలు పెరిగాయని చెప్పడు.

 

సూపర్‌సిక్స్‌ అమలు లేదు:

– సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేయడం లేదు. దాంట్లో చాలా చిన్న అంశం గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ. అందులో పెద్దవి ఏమిటంటే..

– చిన్నపిల్లలకు నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో అత్త కనిపిస్తే నీకు రూ.48 వేలు.. సంతోషమా? ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.20 వేలు అనేవారు.

– అవన్నీ పెద్దవి. అందులో మోసం చేశారనుకుంటే.. చిన్నవైనా గ్యాస్‌ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు. సిలిండర్లపై ఒక్కొ క్కరు ఒక్కోమాట.

– రాష్ట్రంలో యాక్టివ్‌ సిలిండర్లు 1.55 కోట్లు. ఆయిల్‌ కంపెనీల డేటా ఇది. ఆ లెక్కన ఒక్కోటి రూ.895. ఏటా మూడు సిలిండర్లు. మొత్తం కలిపితే రూ.4200 కోట్లు. బడ్జెట్‌లో పెట్టింది రూ.895 కోట్లు. అంటే ఒక సిలిండర్‌ కూడా ఇవ్వరు.

– ఒక సిలిండర్‌ ఇవ్వాలన్నా రూ.1400 కోట్లు కావాలి. కానీ ఆ కేటాయింపు లేదు. అది దారుణ మోసం.

తొలి ఆరు నెలల్లో.. ఉద్యోగాలు–పోలిక:

– మెగా డీఎస్సీ అన్నారు. నిజానికి అందులో మెగా లేదు. మేము 6100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తే, దానికి కొన్ని కలిపి మొత్తం 16,340 పోస్టులు ఇస్తున్నామన్నారు. కానీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఇప్పటికీ ఆరు నెలలైంది.

– ఇదే ఆరు నెలల్లో మా ప్రభుత్వం 2019, అక్టోబరు 2, నాటికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 2.66 లక్షల వాలంటీర్లను నియమించాం. ఆర్టీసీ విలీనం ద్వారా 55 వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాం.

– మరి చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పైగా పరిస్థితి చూస్తే.. 2.66 లక్షల వాలంటీర్‌ ఉద్యోగాలు తీసేశారు. 15 వేల మంది ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తీసేశారు.

వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేశారు:

– మా హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో ఏనాడూ చూడని మార్పులు చేశాం. ఆరోగ్యశ్రీలో 3300 ప్రొసీజర్లు. చికిత్స వ్యయ పరిమితిని రూ.25 లక్షల పెంచాం.

– అప్పుడు చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.1000 కోట్ల కంటే తక్కువ కాగా, మా హయాంలో అది రూ.3700 కోట్లు. ఆ విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం.

సోషియో ఎకనామిక్‌ సర్వేలో బాబు పచ్చి అబద్ధం:

– 2023–24లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం అంట! ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్చారు. అది మా హయాం అయితే, ఆ క్రెడిట్‌ తీసుకుంటూ.. 13,22,319 మంది రోగులకు చికిత్స చేశారట. ఆ ఖర్చు రూ.3762.06 కోట్లు అట! 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆ లెక్కలు.

– అప్పుడున్నది మా ప్రభుత్వం. అయినా అది తమ ఘనత అంటూ దొంగ పబ్లిసిటీ. ఇంత దిక్కుమాలిన విధానం ఎక్కడైనా ఉంటుందా?

– మీ హయాంలో 108, 104 సర్వీసుల సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు లేవు. వారు ధర్నా చేస్తున్నారు.

– ఆరోగ్యశ్రీలో ఏప్రిల్‌ 1 నుంచి బిల్లులు పెండింగ్‌. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. రోగుల పరిస్థితి అగమ్యగోచరం.

– మా ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ పాలసీ అమలు చేశాం. మీరు పోస్టుల భర్తీ ఆపేశారు.

– 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, 5 పూర్తి చేశాం. గత ఏడాది అడ్మిషన్లు మొదలయ్యాయి. మరో రెండు కాలేజీల్లో ఎన్‌ఎంసీ సీట్లు మంజూరు చేసింది. ఇవాళ ఆ కాలేజీలను అమ్మేస్తున్నారు.

సంపద సృష్టి అంటే..:

– సంపద సృష్టి. దానికి అర్ధం ఏమిటో? ఆయన ఆ మాట అంటుంటే, ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

– ఆరు నెలల్లోనే కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఇప్పటికే రూ.6200 కోట్ల బాదుడు నవంబరులో మొదలైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి. మొత్తం దాదాపు రూ.18 వేల కోట్లు.

ఇంకా ఆయన ఏమంటాడు.

– జీఎస్టీలో ఒక శాతం సర్‌ఛార్జ్‌ వేయమని కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడాడట. అది ఆయనకు ఇవ్వాలట. 17 మెడికల్‌ కాలేజీలు అమ్ముతున్నాడు. శరవేగంగా పనులు జరుగుతున్న మూడు పోర్టుల్లో దాదాపు 45 శాతం పనులు జరిగాయి. బ్యాంక్‌లు రుణాలు ఇస్తున్నాయి. అవి పూరై్తతే, ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుంది. వాటినీ అమ్మేస్తున్నారు.

– అదే విధంగా మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆస్తి. భవిష్యత్తులో చాలా విలువ పెరుగుతుంది. అలాంటి వాటి ద్వారా ఆదాయం పెరుగుతుంది. దాన్నే సంపద సృష్టి అంటారు.

– కానీ, చంద్రబాబు ఏం చేస్తున్నాడు. అన్నీ అమ్మేస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు.. రోడ్ల మీద టోల్‌ వేస్తాడట. గ్రామీణ రహదారుల మీద టోల్‌ వసూలు చేయాలట. అదే సంపద సృష్టి అంటున్నాడు.

– పన్నులు వేసి బాదుడే బాదుడును సంపద సృష్టి అంటున్నాడు.

రోడ్డెక్కితే బాదుడే బాదుడు:

– మా ప్రభుత్వంలో రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. చంద్రబాబు హయాంలో, మా హయాంలో రోడ్ల మీద చేసిన ఖర్చు చూస్తే..

– రోడ్ల మరమ్మతులకు చంద్రబాబు హయాంలో రూ.2,953 కోట్లు ఖర్చు చేస్తే, మా హయాంలో రూ.4,648 కోట్లు ఖర్చు చేశాం.

– అలా అన్ని రోడ్లపై చంద్రబాబు హయాంలో రూ.24,792 కోట్లు ఖర్చు చేస్తే, మా హయాంలో అది రూ.43,036 కోట్లు ఖర్చు చేశాం.

– మరి ఈరోజు చంద్రబాబు ఏమంటున్నాడు. మా హయాంలో నిర్మించిన రోడ్లకు మరమ్మతులు చేస్తాడట. ఇంకా ప్రజల మీద రోడ్డు టాక్స్‌ వేసి, దాంతో రోడ్లు వేస్తాడట.

– అలా బాదుడే బాదుడు చేస్తూ, దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు. మనం టోల్‌ కట్టకపోతే, రోడ్ల పరిస్థితి అంతే అంట.

అసైన్డ్‌ భూములపై విష ప్రచారం:

– మా హయాంలో దళితులకు న్యాయం చేశాం. వారు దశాబ్ధాలుగా భూములు సాగు చేస్తున్నా, వారికి దానిపై హక్కులు లేవు. దాంతో వారు చాలా నష్టపోయారు.

– మా ప్రభుత్వం వచ్చాక, వారి గురించి ఆలోచించాం. మేలు చేశాం.

20 ఏళ్లు దాటిన అసైన్డ్‌ భూములకు వారికి అన్ని హక్కులు దఖలు పర్చాం. వాటిపై పూర్తి హక్కులు కల్పించాం.

– అన్ని చేస్తే, మాపై నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆ హక్కులు రద్దు చేస్తారట. అంటే వారి భూములే బాగుండాలి.

– చంద్రబాబు ఒకే మెమోతో 2.06 లక్షల ఎకరాలను 98 వేల మంది రైతులను ఇబ్బంది పెడుతూ, నిషేధిత జాబితా 22–ఏలో పెడితే, మేం వాటికి విముక్తి కల్పించాం. అది తప్పంటాడు.

– భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసిన, 22 వేల ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్‌ తనఖాలో ఉంటే, వాటిని తొలగించి, వారికి హక్కులు కల్పించాం. 22 వేల మందికి మేలు చేశాం.

– 2.06 లక్షల ఎకరాల భూములను ఏకంటా 1.07 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ, సమస్య పరిష్కరించాం.

– మరో 33 వేల ఎకరాలు, 22 వేల మంది రైతులకు సంబంధించిన షరతుగల పట్టాల భూముల సమస్య తొలగించాం. వారికి హక్కు లేక ఇబ్బంది పడుతుంటే, మంచి చేస్తూ సర్వ హక్కులు కల్పించాం.

నిరుపేదలు. ఇళ్లు:

– చంద్రబాబు తన హయాంలో ఒక్క నిరుపేదకు ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా?

– మేము 3.60 లక్షల కుటుంబాలకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్‌ చేయడమే కాకుండా, 21 లక్షల ఇళ్లు మొదలు పెట్టి, 9 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఏకంగా 17 వేల కాలనీలు ఏర్పాటు చేశాం.

– అవి పూరై్తతే, జగన్‌కు మంచి పేరొస్తుందని, ఈరోజు ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆపేశాడు. మా హయాంలో ఇసుక, సిమెంట్‌ ఇచ్చే వాళ్లం. రూ.30 వేల రుణం పావలా వడ్డీకే ఇప్పించాం.

ఎక్కడికక్కడ మాఫియాముఠాలు:

– ప్రజల అవసరాలు పూర్తిగా పక్కకు పోయాయి. కేవలం మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయి. మద్యంలో ఒక స్కామ్, ఇసుకలో మరో స్కామ్‌. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు.

– ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా, పరిశ్రమ కడుతున్నా, మైనింగ్‌ జరుగుతున్నా.. ఆ ఎమ్మెల్యేకు కప్పం కట్టి తీరాల్సిందే. లేకపోతే పనులు జరగవు. చివరకు అదానీ కంపెనీని కూడా అడ్డుకున్నారు.

– ఇది స్కామ్‌ల ప్రభుత్వం. నాకింత. నీకింత. దోచుకోవడం. పంచుకోవడం.

అదే మద్యం. అధిక ధరలు:

– అధికారంలోకి వస్తే మద్యం ధర తగ్గిస్తానని, నాణ్యమైన మద్యం ఇస్తానన్నాడు చంద్రబాబు. నిజానికి అప్పుడు ఇప్పుడు అవే డిస్టిలరీలు. అవే బ్రాండ్లు. అదే మద్యం.

– చీప్‌ లిక్కర్‌. క్వాలిటీ ఇంకా తగ్గించాడు. ప్రజల ఆరోగ్యాన్ని ఆ విధంగా నాశనం చేస్తున్నాడు. అవన్నీ రూ.99 అంట. అంటే క్వాలిటీ తగ్గించి, కొత్త బ్రాండ్లు తెచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే కేరళ మాల్టెడ్‌ ఫైన్‌ విస్కీ వేరే రాష్ట్రాల్లో రూ.85కి అమ్ముతున్నారు. మన దగ్గర రూ.99

– క్వాలిటీ తగ్గించిన మద్యాన్ని మా ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పైగా ఎక్కడా ఎమ్మార్పీకి అమ్మడం లేదు. మాఫియా కమిషన్‌ తీసుకుంటున్నారు.

– బెల్టు షాప్‌లు ప్రమోట్‌ చేస్తున్నారు. వేలం పాడి మరీ బెల్టుషాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలా మాఫియా రాజ్యం సాగుతోంది. ఎమ్మార్పీకి లిక్కర్‌ అమ్మితే, ఎమ్మెల్యేలు అంతలా అరాచకం చేస్తున్నారు. కిడ్నాప్‌లు చేస్తున్నారు. బెదిరిస్తున్నారు.

మహిళల అదృశ్యంపై దుష్ప్రచారం:

– రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని మాపై దుష్ప్రచారం చేశారు. అందుకు వాలంటీర్లు కారణమని చెప్పారు.

– మరి అసెంబ్లీలో ఏం చెప్పారు. కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు గురయ్యారని, వారిలో 34 కేసులు నమోదు చేశామని చెప్పారు. అంటే ఆరోజు వాలంటీర్లపై చేసింది తప్పుడు ఆరోపణ కాదా? అది దుష్పచారం కాదా?

ఉద్యోగులకూ మోసం:

– సూపర్‌సిక్స్‌తోనే మోసం కాదు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతం అన్నారు. కానీ మూడు వారాలైనా చాలా మందికి జీతం రాలేదు. ఐఆర్‌ ఊసే లేదు. మా ప్రభుత్వంలో 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం. ఇప్పుడు రెండు డీఏలు పెండింగ్‌.

– మా హయాంలో పీఆర్సీ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ఆ పీఆర్సీ ఛైర్మన్‌ను వెళ్లగొట్టారు. కొత్త పీఆర్సీ వేయలేదు. ఇదీ ఉద్యోగుల పరిస్థితి.

– టీఎంఎఫ్‌ ఆయాలకు స్కూళ్లలో జీతాలు సక్రమంగా లేవు. ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు. నెలల తరబడి వెయిటింగ్‌.

– ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. వారికి కూడా చాలా హామీలు ఇచ్చాడు. మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ పట్టించుకోవడం లేదు.

వాలంటీర్లకు వంచన:

– ఇక వాలంటీర్లకు సంబంధించి దారుణంగా మాట్లాడారు. మోసం చేశారు. మా హయాంలో అంటే, ఆగస్టు 2023లోనే వాలంటీర్ల వ్యవస్థను మేం తొలగించామని అసెంబ్లీలోనే చెప్పారు.

– ఇది చాలా ఆశ్చర్యం. మరో ఆశ్చర్యం ఏమిటంటే.. వారికి గౌరవ వేతనంగా ఈ ఏడాది రూ.277 కోట్లు ఇచ్చామంటున్నాడు. కరెక్టే కదా? వారికి ఈ ఏడాది ఏప్రిల్, మేలో కూడా జీతాలు ఇచ్చాం కదా? అప్పటికీ చంద్రబాబు సీఎం కాలేదు.ఈ ఏడాది వారికి జీతాలు ఇచ్చినట్లే కదా?

– వాలంటీర్ల గౌరవవేతనం పెంచే ప్రసక్తి లేదన్నారు. అదే ఎన్నికల ముందు ఏమన్నారు? వారికి రూ.10 వేలు ఇస్తామన్నారు.

– మా ప్రభుత్వంలో వాలంటీర్లను 2019, అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు కాగా, వాలంటీర్ల జీతాల కోసం వరసగా.. 2019–20లో రూ.755 కోట్లు, 2020–21లో రూ.1546 కోట్లు, 2021–22లో రూ.1543 కోట్లు, 2022–23లో రూ.1592 కోట్లు, 2023–24లో రూ.1616 కోట్లు, 2024–25లో ఏప్రిల్, మే నెలల్లో రూ.277 కోట్లు ఇచ్చాం.

– ఇవన్నీ ఇంత క్లియర్‌గా ఉంటే, 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు.

– అసలు బడ్జెట్‌ అప్రూవల్‌ లేకుండా, హెడ్‌ ఆఫ్‌ ఎక్కౌంట్‌ లేకుండా జీతాలు ఇవ్వగలరా? వాలంటీర్ల జీతాలకు సంబంధించి కూడా స్పష్టంగా హెడ్‌ ఆఫ్‌ ఎక్కౌంట్స్‌ ఉన్నాయి. అని ఆ నెంబర్లు చెప్పారు.

– అసలు హెడ్‌ ఆఫ్‌ ఎక్కౌంట్స్‌ లేకుండా ఇన్నేళ్లుగా జీతాలు ఎలా ఇచ్చారు. మీరు సీఎం అయ్యే దాకా ఇచ్చాం. మీరు దాన్ని ఎగరగొట్టి, ఇన్ని అబద్దాలు ప్రచారం చేయడం ధర్మమేనా? నోరు తెరిస్తే అబద్ధాలు.

ప్రశ్నిస్తే కేసులు. అరెస్టులు. వేధింపులు:

– తమ హక్కులు, అన్యాయం గురించి సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే దారుణంగా వేధిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. పోలీసులను అన్యాయంగా వాడుకుంటున్నారు.

– ఎమ్మెల్యేలు మాఫియా ముఠాలు ఏర్పాటు చేసి కొడుతున్నారు.

చట్టవిరుద్ధంగా అరెస్టులు చేస్తూ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

– రిటైర్‌ అయిన ఆఫీసర్లు.. ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్‌పీ ఠాకూర్, యోగానంద్‌ ఒక ముఠాగా ఏర్పాటు చేశారు. వారు జిల్లాల్లో ఎవరు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారనేది జాబితా తయారు చేస్తున్నారు.

– ఎస్పీలకు పంపించి, ఇల్లీగల్‌గా అరెస్టు చేస్తున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్డడం లేదు. వేర్వేరు పోలీస్‌ స్టేషన్లు తిప్పుతున్నారు. కళ్లకు గంతలు కడుతున్నారు.

– థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. కొడుతూ వీడియోలు తీసి పైవారికి పంపించి, శాడిజమ్‌ చూపిస్తున్నారు.

– ఎఫ్‌ఐఆర్‌లు అప్‌లోడ్‌ చేయడం లేదు. అలా చేస్తే, న్యాయప్రక్రియ వేగంగా జరగుతుందని. ఎక్కడైనా వారిని లాయర్లు బయటకు తెస్తే, మళ్లీ కేసులు పెడుతున్నారు.

– ఎవ్వరినీ వదలడం లేదు. సినీ దర్శకులను కూడా వదలడం లేదు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటలో ఎస్పీ దగ్గరుండి, నాటు తుపాకులు పెట్టాలని చూశారట. తోటలో ఒక ముసలామె ఉంటే, ఆమెను కొట్టి, ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆమె దెబ్బలను మెజిస్ట్రేట్‌కు చూపిస్తే, ఆయన సీఐని తిట్టాడు.

– వారు ఏ సినిమాలు అయినా తీయొచ్చు. రాంగోపాల్‌వర్మ సినిమా తీశాడు. దానికి సెన్సార్‌ బోర్డు అనుమతి కూడా వచ్చింది. ఆయనకూ నోటీసులు పంపారు. అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలనూ వదలడం లేదు:

– మా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌. పేకాట క్లబ్‌లపై పోస్టులు పెట్టి ప్రశ్నిస్తే ఎనిమిది కేసులు పెట్టారు.

– మాజీ ఎంపీ నందిగం సురేష్‌ 70 రోజులుగా జైలులో ఉన్నాడు. ఆయన టీపీడీ ఆఫీస్‌మీద దాడి చేయలేదు. అయినా కేసుల మీద కేసులు పెట్టి బెయిల్‌ రాకుండా చేస్తున్నారు.

– ఇలా రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌:

– ఒక వైపు కేసులు. మరోవైపు దుష్ప్రచారం. టాపిక్‌ డైవర్ట్‌ చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో, అబద్దాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో, వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు ఎంత ప్రసిద్దుడో అందరికీ తెలుసు.

– లక్ష్మీపార్వతితో మొదలుపెడితే నా వరకు. ఎన్నికల ముందు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద, విద్యుత్‌ మీద, రోడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, పరిశ్రమల మీద, పారిశ్రామికవేత్తల మీద.. అ«ధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూల మీద దుష్ప్రచారం.

– ఇవన్నీ గాక, తల్లీ చెల్లీ అంటే నా కుటుంబంపై ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నాడు.

క్రూరమైన రాజకీయాలు:

– చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. నీకు కుటుంబం ఉంది. మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నీవు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరు.

– నేను చంద్రబాబును ఒకటే అడుతున్నాను. నేను సీఎంగా ఉన్నప్పుడు, ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీస్‌లో తన పార్టీ అఫీషియల్‌ ప్రతినిధితో నన్ను ఏమని తిట్టించాడు.. బోస్‌డీకే అని. అది ధర్మమేనా?

– ఇదే చంద్రబాబునాయుడు నా చెల్లెలు షర్మిల మీద, హైదరాబాద్, జూబిలీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఆయన బావమరిది బాలకృష్ణ, లోకేష్‌ మామ తన సొంత టవర్‌ ఎన్బీకే బిల్డింగ్స్‌ నుంచి తప్పుడు వార్తలు రాయించలేదా? పోలీసుల దర్యాప్తులో అది తేలలేదా?

– ఇంకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఆయనకు చెందిన ఐ–టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్‌ అనే వాడు ఒక ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి, దాని ద్వారా మా అమ్మను, మా చెల్లిని తిట్టించాడు. దీంతో వర్రా రవీందర్‌రెడ్డి కేసు పెడితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు ఉదయ్‌భూషణ్‌ను ఆధారాలతో సహా అరెస్టు కూడా చేశారు.

– చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవ్వరిమీద అయినా సరే, వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఆయనే మన సానుభూతిపరుడు ఎవరైనా ఉంటే, వారి పేరుతో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేయిస్తాడు. వారితోనే మనల్ని తిట్టిస్తాడు. మనం తిట్టించామని బయట ప్రచారం చేస్తాడు.

– ఇటువంటి మనిషి ప్రపంచంలో అరుదుగా పుడతాడు.

ఏనాడైనా నీ తల్లిదండ్రులను పట్టించుకున్నావా?:

– నేను చంద్రబాబును సూటిగా ఒకటే అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు.

– నీ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు చూపించావా? వారితో కలిసి ఎప్పుడైనా ఉన్నావా?

– రాజకీయంగా నీవు ఎదిగిన తర్వాత నీ ఇంటికి తీసుకొచ్చి రెండు పూటలు భోజనం పెట్టి, వారిని సంతోషంగా పంపించావా? వారిద్దరూ కాలం చేస్తే, కనీసం తలకొరివి అయినా పెట్టావా?

– ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డి అయినా తింటాడు. ఏ అబద్ధం అయినా ఆడతాడు. మోసం చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాం.

– రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.

పోలవరం ప్రాజెక్టుపై మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

చంద్రబాబు తప్పిదాలే కారణం:

– అసలు పోలవరంలో ఇప్పటి పరిస్థితికి కారణం ఎవరు? అది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏం చెప్పింది.పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబుగారి తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది.

– మీకు క్లియర్‌గా అర్ధమయ్యేలా చెబుతాను. పోలవరం వద్ద నది దాదాపు 2.5 కి.మీ వెడల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కదా, ప్రాజెక్ట కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్‌వే పనులు పూర్తి చేయాలి. కానీ అవి పూర్తి చేయలేదు.

– అవి పూర్తి కాకుండానే కాఫర్‌డ్యామ్‌ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్‌ డ్యామ్‌ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్‌ డ్యామ్‌ పనులు చేయాలి. నదికి అటు, ఇటు రెండు కాఫర్‌డ్యామ్‌ల పనులు మొదలుపెట్టాడు.

– అంటే ఒకవైపు స్పిల్‌వే పూర్తి చేయలేదు. మరోవైపు మెయిన్‌డ్యామ్‌కు ఫౌండేషన్‌ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్‌వర్క్‌లు. కమిషన్లు వస్తాయి. అవి సిమెంటు పనులు. కమిషన్లు రావు.

– ఈలోగా సీజన్‌ వచ్చింది. స్పిల్‌వే పనులు సాగుతున్నాయి. కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్‌డ్యామ్‌పై రెండు గ్యాప్‌లు వదిలారు.

– అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది. ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్‌ అయిన డయాఫ్రమ్‌వాల్‌ పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి.

– అందుకే మేం రాగానే స్పిల్‌వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్‌గా పోతున్నాయి. కాఫర్‌డ్యామ్‌ మరమ్మతులు మేమే చేశాం.

– ఇక డయాఫ్రమ్‌వాల్‌ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? నిపుణులు తేల్చాలి.

– చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది.

 

– స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం లేకపోతే, ఆయనతో పాటు, అందులో ప్రమేయం ఉన్న వారిని ఈడీ ఎందుకు అరెస్టు చేసింది? వారి ప్రాపర్టీస్‌ను ఎందుకు అటాచ్‌ చేశారు? చంద్రబాబు డబ్బులిచ్చారు కాబట్టి, ఆయన్నూ అరెస్టు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment